సంప్రదాయం.. ఆధునికం.. సమ్మిళిత జీవనం!

by Javid Pasha |

ఒకప్పటితో పోలిస్తే.. ఆధుని, సంప్రదాయ సమ్మిళిత జీవన విధానంపట్ల నేటి మహిళల్లో ఆసక్తి పెరుగుతోంది!

సంప్రదాయం.. ఆధునికం.. సమ్మిళిత జీవనం!
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ఎక్కువమంది మహిళల్లో సంప్రదాయ జీవనశైలిపట్ల ఎక్కువ ఆసక్తి ఉండేది. ఆ తర్వాత మోడర్న్ లైఫ్ స్టైల్ పట్ల ఇంట్రెస్ట్ పెరిగింది. అయితే ఇటీవలి కాలంలో ఈ రెండింటికి భిన్నంగా మహిళలు ఒక కొత్త జీవనశైలిని అనుసరిస్తున్నారని సామాజిక పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా ఆధునిక అమ్మాయిల్లో ఈ ధోరణి విస్తరిస్తోందని చెబుతున్నారు. ఇంతకీ అదేమిటంటే.. అటు సంప్రదాయం, ఇటు ఆధునికతలతో మిళితమైన ఒక కొత్త సమ్మిళిత జీవన శైలిని నేటి మహిళలు అనుసరిస్తున్నారు. సౌకర్యం, ఆనందమయ జీవితంపట్ల ఆసక్తులు ఈ మార్పునకు దారితీస్తున్నాయని పేర్కొంటున్నారు.

సందర్భోచితం.. సముచితం..

ముఖ్యంగా ఒకప్పటితో పోలిస్తే బాగా చదువుకోవాలి, పురుషులతో సమానంగా ఎదగాలి. ఉద్యోగాలు చేయాలి అనే ఆలోచన నేటి అమ్మాయిల్లో పెరుగుతోంది. అదే సందర్భంగా కుటుంబ సంప్రదాయాలు పాటించడం, గృహిణులుగా ఉండటం పట్ల కూడా అత్యంత ఆసక్తితో ఉంటున్నారు. తాము ఏ ఉద్యోగం చేసినా, ఏ కెరీర్‌లోకి ప్రవేశించినా ఓ వైపు సంప్రదాయాన్ని, మరోవైపు ఆధునిక ధోరణులను సైతం పాటిస్తూ సంతోషంగా ఉండాలని ఆధునిక మహిళలు భావిస్తున్నారు. ఈ ఆలోచనలను ఆచరణలో పెడుతున్నారు. ఆయా సందర్భాలు, వేదికలు, వేడుకలను బట్టి ఆధునిక వస్త్రధారణతోనూ, సంప్రదాయ దుస్తుల్లోనూ కనిపిస్తూ.. అందరినీ ఆకట్టుకుంటున్నారు.

సంప్రదాయ పాత్రలవైపు..

ఒకప్పటితో పోలిస్తే.. ఆధుని, సంప్రదాయ సమ్మిళిత జీవన విధానంపట్ల నేటి మహిళల్లో ఆసక్తి పెరుగుతోంది. దీంతోపాటు గృహిణిగా ఇంటి జీవితం, కుటుంబం, సంబంధాలలో సంప్రదాయ పాత్రలవైపు ఆకర్షణ ఆధునిక మహిళల్లో కొత్త మార్పును సూచిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు సైతం సంప్రదాయం, ఆధునికతలతో మిళతమైన జీవనశైలిని ఆకర్షణీయంగా, సంతోషకరమైనదిగా చూపించే ధోరణి ఇటీవల పెరుగుతోంది. మొత్తానికి ఆధునిక, సంప్రదాయ జీవనశైలుల సమ్మిళిత జీవితంపట్ల మహిళల్లో ఆసక్తి, ఆకర్షణ పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.

Next Story