Miss World pageants : మిస్ వరల్డ్ పోటీలంటే అందం మాత్రమే కాదు.. ఇంకా అవి కూడా..!!

by Javid Pasha |

Miss World pageants : మిస్ వరల్డ్ పోటీలంటే అందం మాత్రమే కాదు.. ఇంకా అవి కూడా..!!

Miss World pageants : మిస్ వరల్డ్ పోటీలంటే అందం మాత్రమే కాదు.. ఇంకా అవి కూడా..!!
X

దిశ, ఫీచర్స్ : మిస్ వరల్డ్ పోటీలు..(Miss World pageants) ఈ పేరు వింటేనే ప్రస్తుతం ప్రపంచ దేశాలకు మన హైదరాబాద్ గుర్తుకు వస్తున్నది. ఎందుంటే 2025కు సంబంధించిన ప్రపంచ సుందరి పోటీలకు ఈ విశ్వనగరం వేదికైంది. వందకు పైగా దేశాల నుంచి అందాల తారలు పాల్గొంటుండగా.. ఈ 72వ మిస్ వరల్డ్ పోటీల ఎడిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం హోస్ట్ చేస్తున్నది. ‘Beauty with a Purpose’ థీమ్‌తో మే 31 వరకు ఇవి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పలువురు వీటి గురించి డిస్కస్ చేస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.

బ్యూటీ విత్ ఎ పర్పస్

మిస్ వరల్డ్ పోటీలపై కొందరిలో విమర్శలు సైతం వ్యక్తం అవుతున్నాయి. మరికొందరు సమర్థిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వం, ఆధునికతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఇదొక అవకాశంగా చాలా మంది భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా అదే చెబుతోంది. మిస్ వరల్డ్ పోటీలవల్ల తెలంగాణ రాష్ట్రానికి అనేక లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

అందమే కాదు.. ఈ బెనిఫిట్ కూడా..

మిస్ వరల్డ్ పోటీలంటే కేవలం అందం, ఆనందం కోణంలో మాత్రమే చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి కేవలం వీటినే ఆధారంగా చేసుకోవు. వీటివెనుక సామాజిక ప్రయోజనాలు కూడా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీలు “బ్యూటీ విత్ ఎ పర్పస్” అనే థీమ్‌తో సామాజిక సమస్యలపై అవగాహన పెంచడాన్ని, హ్యూమానిటేరియన్ కారణాలను ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయని పర్యాటక నిపుణులు పేర్కొంటున్నారు.

స్థానిక సంస్కృతికి ప్రపంచస్థాయి గుర్తింపు

మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ జరగడంవల్ల తెలంగాణ పేరు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అవుతుంది. ఇప్పటికే ‘జరూర్ ఆనా తెలంగాణ’ నినాదం సోషల్ మీడియాలో మారుమోగుతోంది. భవిష్యత్‌లో పర్యాటక రంగంలో కీలకపాత్ర పోషించేందుకు ఈ మిస్ వరల్డ్ పోటీలు సానుకూల అవకాశాలను క్రియేట్ చేస్తాయి. అంతేకాకుండా తెలంగాణ సంస్కృతి, హైదరాబాద్ కల్చర్ ప్రపంచానికి పరిచయం అవుతుంది. స్థానిక కళాకారులు, చేనేత కార్మికులు, చిన్న వ్యాపారాలకు ఈ వేదిక అవకాశాలను కల్పిస్తుంది. ఉదాహరణకు, పోచంపల్లి చేనేత, చెరియాల్ పెయింటింగ్స్, సిల్వర్ ఫిలిగ్రీ వంటి సాంప్రదాయ కళలు ప్రమోట్ అవుతాయి. ఫైనల్లీ ఈవెంట్ ద్వారా రాష్ట్రం ఆర్థికంగా లాభపడుతుందని నిపుణులు అంటున్నారు.

సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు

మిస్ వరల్డ్ పోటీలంటే కళ్లు మిరుమిట్లు గొలిపే వెలుగు జిలుగులు, తారల తళుక్కులు మాత్రమే కాదు. ప్రతీ ఈవెంట్‌లో “బ్యూటీ విత్ ఎ పర్పస్”లో భాగంగా అనాథలు, వికలాంగులు, పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక అంశాలపై ఫోకస్ చేస్తూ ఏదో ఒక మెసేజ్ ఇచ్చేలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీంతోపాటు అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలు, వ్యాపార అవకాశాలు మెరుగు పడుతాయి. తెలంగాణ రాష్ట్రం సురక్షితమైన, ఆతిథ్యమిచ్చే పర్యాటక గమ్యస్థానంగా ప్రపంచానికి చాటి చెప్పడంలో ఈ ప్రపంచ సుందరిపోటీలు కీలకంగా మారుతాయి. దీంతో భవిష్యత్తులో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడులు వస్తాయి. సాంస్కృతిక గుర్తింపు ద్వారా రాష్ట్రానికి ఆర్థిక, వ్యాపారపరమైన లాభాలు చేకూరుతాయి.

Next Story