- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2023 నుండి తల్లులు, వివాహితలు కూడా మిస్‌యూనివర్స్‌లు కావచ్చు!!
తాజా ప్రకటనతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. Miss Universe beauty pageant to allow married women and mothers.

దిశ, వెబ్‌డెస్క్ః నిజంగా ఇదొక చారిత్రాత్మక అడుగుగా అంతర్జాతీయ మహిళా సమాజం పేర్కొంటుంది. మిస్ యూనివర్స్ అందాల పోటీ అక్షరాలా తన విశ్వాన్ని విస్తరించిందని ప్రశంసలు అందుతున్నాయి. ఎందుకంటే, ఎంతో మంది మహిళలు కలలుగనే ఈ మహిళల అందాల పోటీలో ఇకపై, తల్లులు, వివాహితలు కూడా పాల్గొనడానికి వీలు కల్పించారు. 2023 నుండి వీళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చంటూ ప్రకటించారు. అయితే, ఇప్పటి వరకు, మిస్ యూనివర్స్ పోటీలో వివాహితలు, తల్లులు పాల్గొనడానికి అనుమతి లేకుండా కఠినమైన నియమాలు ఉండేవి. పోటీలో విజేతలు టైటిల్ మొత్తం పదవీకాలంలో అవివాహితులుగా ఉండాలని నియమం ఉండేది. విజేతలు మిస్ యూనివర్స్ టైటిల్‌ను పొందే ఏడాది వరకూ గర్భవతి కాకూడదు. అయితే, ఈ తాజా ప్రకటనతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఇక, మిస్ యూనివర్స్ 2020 విజేత ఆండ్రియా మెజా, ఈ తాజా నిబంధనల మార్పును ప్రశంసించారు. దీనికి సంబంధించి, ఇన్‌సైడర్‌తో మాట్లాడిన ఆమె, "నిజాయితీగా ఇలా జరగడాన్ని నేను ఇష్టపడుతున్నాను. సమాజంలో మార్పు వచ్చింది. గతంలో పురుషులు మాత్రమే చేయగలరని అనుకున్న ఎన్నో విషయాల్లో మహిళలు రాణిస్తున్నారు. ఇక, ఇప్పుడిప్పుడే మహిళలు నాయకత్వ స్థానాలను ఆక్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ పోటీలకు సమయం వచ్చింది. కుటుంబాలతో ఉన్న మహిళలకు మార్గం సుగమం అయ్యింది" అన్నారు. అయితే, "కొంతమంది వ్యక్తులు ఈ మార్పులకు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే, అలాంటి వాళ్లు రిలేషన్‌షిప్ కోసం అందుబాటులో ఉన్న ఒంటరి, అందమైన స్త్రీని కోరుకుంటారు" అని మెజా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, అంతర్జాతీయంగా ఈ అంశంపై చర్చ రాజుకుంది.






