వారెవ్వా.. ఈ ఫొటో ఏంట్రా ఇంతలా కదిలించింది.. ఇది చూస్తే మీ గుండె బరువెక్కడం ఖాయం..!

by Sujitha Rachapalli |   (  Updated:2025-04-27 11:36:46  IST  )

మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు రోడ్డు మీద పిచ్చివాళ్లుగా తిరగడం గమనిస్తూనే ఉంటాం. ఎంతో కొంత సహాయం చేయడానికి బదులు మనల్ని ఎక్కడ కొడుతారో అని దూరంగా జరిగి ఓ పక్క నుంచి పారిపోయినంత పని చేస్తాం.

వారెవ్వా.. ఈ ఫొటో ఏంట్రా ఇంతలా కదిలించింది.. ఇది చూస్తే మీ గుండె బరువెక్కడం ఖాయం..!
X

దిశ, ఫీచర్స్ : మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు రోడ్డు మీద పిచ్చివాళ్లుగా తిరగడం గమనిస్తూనే ఉంటాం. ఎంతో కొంత సహాయం చేయడానికి బదులు మనల్ని ఎక్కడ కొడుతారో అని దూరంగా జరిగి ఓ పక్క నుంచి పారిపోయినంత పని చేస్తాం. కానీ అలా మెంటల్‌గా డిస్టర్బ్ అయిన వారిలోనూ ప్రేమ, సహాయ గుణాలు ఉంటాయని నిరూపించింది ఈ మహిళ. ఎండలో ఓ చిన్న పిల్లాడు నిధుల సేకరణ చేస్తుంటే తనకు భిక్షం రూపంలో వచ్చిన మొత్తం డబ్బులను ఇచ్చేసింది. దీంతో ఆ చిన్నోడు మనలా కాకుండా ఆ అమ్మకు హగ్ ఇచ్చి ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇంతకు మించిన గొప్ప ఫొటో లైఫ్‌లో చూడలేదని అంటున్నారు నెటిజన్లు.

గుడ్ ఫ్రైడే సందర్భంగా ది సిక్ పికిన్ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈ భావోద్వేగ క్షణం ఆవిష్కృతమైంది. నిధుల సేకరణలో సహాయం చేస్తున్న చిన్నారి మలైకాను మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళ సమీపించింది. ఆమె వద్ద ఇవ్వడానికి ఎక్కువ లేకపోయినా.. తన వంతు సాయంగా ఉన్నదంతా ఇచ్చేసింది. ఈ స్వచ్ఛమైన దానగుణం ప్రతి ఒక్కరినీ కదిలించింది. కాగా ఈ ఫొటోను ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడు, మలైకా తండ్రి ఇష్మీల్ ఆల్ఫ్రెడ్ చార్లెస్ షేర్ చేశాడు. అత్యంత నిర్లక్ష్యానికి గురైన హృదయాల నుంచి నిజమైన దయాగుణం వెలువడుతుందని ఈ పిక్ గుర్తు చేస్తుంది.

Next Story