- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆనందం, ఆత్మవిశ్వాసం అన్నీ వాళ్లే..! అక్కా చెల్లెళ్లను కలిగి ఉన్న పురుషులకు ఎన్ని లాభాలో తెలుసా?
ఆనందం, ఆత్మవిశ్వాసం అన్నీ వాళ్లే..! అక్కా చెల్లెళ్లను కలిగి ఉన్న పురుషులకు ఎన్ని లాభాలో తెలుసా?

దిశ, ఫీచర్స్ : మెరుగైన సామాజిక నైపుణ్యాలు, ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం, ఆత్మస్థైర్యం, గుండె ధైర్యం.. అధికంగా కలిగి ఉండే పురుషులను మీరెప్పుడైనా నోటీస్ చేశారా? అయితే వారికి అక్కా చెల్లెళ్లు తప్పకుండా ఉండి ఉంటారు! ఎందుకంటే సోదరీమణులను కలిగి ఉన్న పురుషుల్లోనే ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని యూఎస్‌ఏలోని బ్రిఘమ్ యంగ్ యూనివర్సిటీ(Brigham Young University )కి చెందిన పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది.
అధ్యయనంలో భాగంగా పరిశోధకులు మొత్తం 395 కుటుంబాలలో, 10 నుండి 14 సంవత్సరాల వయస్సు గల యువకులను పరిశీలించారు. సోదరీమణుల(Sisters' affiliation) ఉనికి వారి మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిందో అబ్జర్వ్ చేశారు. ఈ సందర్భంగా వారు ఒక్కరు లేదా అంతకంటే ఎక్కువమంది అక్క చెల్లెళ్లు కలిగి ఉన్న యువకులు మెరుగైన మానసిక స్థితిని కలిగి ఉంటున్నట్లు గుర్తించారు. అక్కా చెల్లెళ్లు లేనివారితో పోలిస్తే, వారిని కలిగి ఉన్న యువకుల్లో ఉన్నతమైన ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం, ఆత్మ విశ్వాసం, గుండె ధైర్యం, సామాజిక నైపుణ్యలు వంటివి అధికంగా ఉన్నాయని, ముఖ్యంగా వీరు పాజిటివ్ మెంటాలిటీని కలిగి ఉంటున్నారని కనుగొన్నారు.
సహజంగానే సోదరీమణులతో కలిసి పెరిగే క్రమంలో ఒంటరితనం, అపరాధ భావన, భయం వంటి ప్రతికూల భావోద్వేగాలను తగ్గించడంలో వారుు సహాయపడతారు. అలాగే దయ, ఔదార్యం, సానుభూతి వంటి(Kindness, generosity, empathy, etc.) సామాజిక విలువలను పెంపొందిస్తారు. మెరుగైన మానసిక శ్రేయస్సుకు కారణం అవుతారు. కాబట్టి సిస్టర్స్ కలిగి ఉన్న పురుషులు అధిక ఆత్మగౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, సామాజిక నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఈ పరిశోధన సోదరీమణుల మధ్య సంబంధాలు కేవలం ఎమోషనల్ సపోర్టింగ్ మాత్రమే కాకుండా, జీవితంలో దీర్ఘకాలిక సామాజిక, మానసిక ప్రయోజనాలను కూడా అందిస్తాయని అధ్యయనం పేర్కొన్నది.






