- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నయా ట్రెండ్.. అందానికే అందం నీవే సుందరా...!! ఆఫీసుకు చీరలు కట్టుకొని వెళ్తున్న పురుషులు
సొసైటీలో బతుకుతున్నాం... సంఘ జీవులం.. కాబట్టి ఇతరుల అంచనాలకు అనుగుణంగా బతకాలని అనుకుంటాం.. లేదంటే ఏమనుకుటారోననే భయంతో ఉంటాం.. కానీ కొందరు మాత్రం ఎవరేం అనుకుంటే మాకేంటి అనే దూసుకుపోతుంటారు.. పక్కోడి అంచనాలను అందుకునే క్రమంలో తమను

దిశ, వెబ్ డెస్క్ : సొసైటీలో బతుకుతున్నాం... సంఘ జీవులం.. కాబట్టి ఇతరుల అంచనాలకు అనుగుణంగా బతకాలని అనుకుంటాం.. లేదంటే ఏమనుకుటారోననే భయంతో ఉంటాం.. కానీ కొందరు మాత్రం ఎవరేం అనుకుంటే మాకేంటి అనే దూసుకుపోతుంటారు.. పక్కోడి అంచనాలను అందుకునే క్రమంలో తమను తాము కోల్పోతున్నామని గుర్తించి.. తమకు నచ్చినట్లుగా బతుకుతుంటారు. హ్యాపీగా ఉంటారు. లైఫ్‌ను శాటిస్ఫైయింగ్‌గా మలుచుకుంటారు. నిజానికి వారు చేసేదే కరెక్ట్. ఎవడో ఏదో అనుకుంటాడని మెంటల్ స్ట్రెస్ తీసుకుని అనారోగ్యం పాలయ్యే బదులు.. ఈరోజు మార్పును చూపిస్తే రేపు ఎదుటి వ్యక్తులకు నార్మల్‌గా అనిపిచడం సహజం.
ఇలాంటిదే అమ్మాయిల డ్రెసింగ్ కూడా.. ముందుగా చీరలు, లంగా ఓణీలు.. ఆ తర్వాత డ్రెస్సులు.. ఆ తర్వాత జీన్స్ అండ్ టీషర్ట్.. ఆ తర్వాత వన్ పీస్.. ఇలా ఎన్నో రకాలుగా మారిపోయింది. అమ్మాయిలంటే ఇలాగే ఉండాలి.. ఇలాగే చేయాలి.. ఇలాగే బట్టలు చుట్టుకోవాలి.. అని కాకుండా.. నచ్చినట్లుగా బతుకుతామనే వారు ఎక్కడో మార్పుకు జీవం పోశారు. అది నేడు నార్మలైజ్ అయిపోయింది.
అయితే ఇప్పుడు మగాళ్లు కొందరు తమ డ్రెసింగ్‌లో మార్పు కోరుకుంటున్నారు. చీరలు ఆడవాళ్లకు మాత్రమేనా? అని ప్రశ్నిస్తున్నారు. వాళ్లు మాత్రమే కట్టుకోవాలని ఎక్కడ రాసిలేదు కదా.. నచ్చితే ఎవరైనా పాటించొచ్చు.. చీరలో తమ అందాన్ని చూసుకుని ఆనందించవచ్చు అంటున్నారు. ఈ రోజు చాలా మందికి కొత్తగా అనిపించినా ఆ తర్వాత పాతబడి పోతుందిలే అనుకుంటున్నారు.స్పెషల్ అకేషన్స్‌లో ఆఫీసుల్లో చీరలో మెరుస్తున్నారు. శారీ వేరింగ్‌ను జెండర్ న్యూట్రల్‌గా ఎందుకు చూడకూదని అడుగుతున్నారు. జస్ట్ చీర మాత్రమే కాదు.. ఇలా చాలా మంది అమ్మాయిలకు మాత్రమే అనే వస్తువులను వాడుతూ.. జెండర్ గ్యాప్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పూణేకు చెందిన సిద్ధాంత్ కొడ్లేకర్. తొమ్మిదేళ్లుగా హై హీల్స్ వాడుతున్నారు. ముందుగా కొంత మంది వింతగా, తేడాగా చూసినా.. ఆ తర్వాత అతన్ని ఫాలో అయిపోయారు. చాలా మంది అబ్బాయిలు అతన్ని చూసి హై హీల్స్ వేసుకోవడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా అతని ఆఫీసులో వారు. ఇక మేకప్ ఆర్టిస్ట్ అమిత్ కర్మర్కర్. మేకప్ వేసుకుని బయటికి వచ్చే ఆయనను మొదట్లో అందరూ వింతగా చూశారు. కానీ ఇప్పుడు అతన్ని ఓ వీఐపీగా ట్రీట్ చేస్తున్నారు. మోటివేషనల్ స్పీచ్‌లకు ఆయనను ప్రిఫర్ చేస్తున్నారు.






