- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మాయిల విషయంలో మరీ ఇంత కరువులో ఉన్నారేంట్రా బాబు.. రోజుకు ఇన్ని గంటలు అదే పని..
అమ్మాయిల అందానికి ఫిదా కానీ మగాళ్లు ఉంటారా? ఎప్పుడో ఎక్కడో కచ్చితంగా పడిపోవాల్సిందే. ఈ విషయాన్ని బేస్ చేసుకుని చేసిన అధ్యయనం రిజల్ట్స్ నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అమ్మాయిల అందాలను చూస్తూ

దిశ, ఫీచర్స్ : అమ్మాయిల అందానికి ఫిదా కానీ మగాళ్లు ఉంటారా? ఎప్పుడో ఎక్కడో కచ్చితంగా పడిపోవాల్సిందే. ఈ విషయాన్ని బేస్ చేసుకుని చేసిన అధ్యయనం రిజల్ట్స్ నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అమ్మాయిల అందాలను చూస్తూ గడిపేందుకు అబ్బాయిలు రోజుకు 43 నిమిషాల సమయాన్ని కేటాయిస్తున్నారట. ఇది ఏడాదికి సుమారు 259 గంటలు కాగా దాదాపు 11 రోజులకు సమానం. 3000 మందిపై కోడాక్ లెన్స్ విజన్ సెంటర్స్ నిర్వహించిన సర్వే ఈ ఫలితాన్ని ప్రకటించింది.
సర్వే ప్రకారం పురుషులు రోజుకు సగటున 10 మంది స్త్రీలను చూస్తారు. సూపర్‌మార్కెట్‌లు ఇందుకు ప్రధాన స్థలంగా ఉన్నాయి. తర్వాత పబ్‌లు, నైట్‌క్లబ్‌లు, వర్క్ ప్లేస్‌లు ఉన్నాయి. దాదాపు సగం మంది పురుషులు స్త్రీ శరీర ఆకృతినే మొదట చూస్తామని చెప్పగా.. చాలా మంది స్త్రీలు ఇలా చూడటం ఆనందంగా భావించినా.. 16% మంది స్త్రీలు అసౌకర్యంగా భావించారు. 20% మంది సిగ్గుపడ్డారు. అయితే 35% మంది తాము చూసిన వ్యక్తులతో లవ్‌లో పడిపోయామని, రిలేషన్‌షిప్ స్టార్ట్ చేశామని చెప్తే.. మరో మూడవ వంతు మంది భాగస్వాములతో గొడవలు జరిగాయని తెలిపారు. మరోవైపు స్త్రీలు రోజుకు సగటున 20 నిమిషాలు ఆరుగురు పురుషులను చూస్తారని.. 18 నుండి 50 సంవత్సరాల మధ్య సుమారు ఆరు నెలల సమయం ఇలా గడుపుతారని తేలింది. స్త్రీలు పబ్‌లు, బార్‌లను పురుషులను చూడటానికి ప్రధాన స్థలాలుగా ఎంచుకున్నారు. 40% కంటే ఎక్కువ మంది పురుషుల కళ్ళు తమను ఆకర్షిస్తాయని చెప్పారు.






