Raja Karni Singh: పాకిస్థాన్ లో మీసం మెలేస్తున్న హిందూ రాజు.. అక్కడ ఆయన మాటే శాసనం.. పాక్ ప్రధాని కూడా సలాం చేయాల్సిందే..!

by Vennela |

Raja Karni Singh: 1947లో భారత్ పాకిస్తాన్ 2 విడిపోవడంతో వేరు, వేరు దేశాలుగా దేశ విభజన జరిగింది.

Raja Karni Singh: పాకిస్థాన్ లో మీసం మెలేస్తున్న హిందూ రాజు.. అక్కడ ఆయన మాటే శాసనం.. పాక్ ప్రధాని కూడా సలాం చేయాల్సిందే..!
X

దిశ, వెబ్ డెస్క్:Raja Karni Singh: 1947లో భారత్ పాకిస్తాన్ 2 విడిపోవడంతో వేరు, వేరు దేశాలుగా దేశ విభజన జరిగింది. ఇరుదేశాల మధ్య పెద్ద ఎత్తున ప్రజల సర్దుబాటు జరిగింది. పాకిస్తాన్లోని హిందువులు సిక్కులు, పెద్ద ఎత్తున భారతదేశానికి తరలిరాగా, భారతదేశ నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు పాకిస్తాన్ తరలి వెళ్లారు. అయితే ఇప్పటికి కూడా పాకిస్తాన్ లో హిందువులు పెద్ద ఎత్తున ఉన్నారు. కాగా పాకిస్తాన్లో ఒక హిందూ రాజ కుటుంబం గత 70 సంవత్సరాలుగా అక్కడ ఏకచత్రాధిపత్యంగా తన ప్రభావం కొనసాగిస్తోంది.

పాకిస్తాన్లోని ఉమర్ కోట్ రాజవంశం అక్కడ రాజకీయంగా ఎదగడం మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో ప్రజలకు ముఖ్యంగా హిందువులకు భరోసా ఇస్తూ తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. నిజానికి పాకిస్తాన్ దేశ విభజన జరిగినప్పుడు సింధ్ ప్రాంతంలో ఉన్న ఉమర్ కోట్ ఆ దేశం విడిచి భారత్ లోకి వెళ్లేందుకు సిద్ధపడలేదు. పాకిస్తాన్లోనే ఉండేందుకు నిర్ణయం తీసుకుంది.

ఉమర్ కోట్ రాజు రానా అర్జున్ సింగ్ తమ రాజవంశం తమను నమ్ముకున్న ప్రజలు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లే ప్రసక్తే లేదని పాకిస్తాన్లోనే ఉంటామని నిర్ణయించారు. పాకిస్తాన్ సృష్టికర్త మహమ్మద్ అలీ జిన్నా తో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగానే ఉమర్ కోట్ పాకిస్థాన్ లో కొనసాగింది. అలాగే ఉమర్ కోట్ రాజా అర్జున్ సింగ్ పాకిస్థాన్ పార్లమెంటులో ఎంపీగా ఉన్నారు.

అర్జున్ సింగ్ అనంతరం ఆయన కుమారుడు హమీర్ సింగ్ పాకిస్థాన్ ప్రధాని బెనజీర్ భుట్టో కేబినేట్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ మినిస్టర్ గా సైతం పనిచేశారు. వీరి రాజవంశం వారసుడు రాజా కర్ణి సింగ్ 2015లో రాజస్థాన్ జైపూర్ కు చెందిన రాణీ పద్మిని రాథోడ్ ను వివాహం చేసుకున్నారు. ఒక దశలో వీరి వంశస్తుడైన రాజా చంద్ర సింగ్ పాకిస్తాన్లో హిందూ పార్టీని సైతం నెలకొల్పారు.

పాకిస్థాన్లోని అల్ప సంఖ్యాక హిందువుల హక్కుల కోసం ఆయన అనేక బహిరంగ సభలు సైతం నిర్వహించారు. అయితే ఆయన డిమాండ్లకు పాకిస్తాన్ ప్రభుత్వం దిగి రావడంతో ఆయన మళ్లీ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీలో చేరారు. నేటికీ కూడా వీరి ఆధీనంలో పాకిస్థాన్లోని సింధు ప్రాంతంలో ధాటా అని పిలవబడే 22000 చదరపు కిలోమీటర్ల వీరి అదుపు ఆజ్ఞల్లో ఉంటుంది.

Next Story