- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెడిటేషన్‌తో మెదడుకు మేలు.. ఆరోగ్యంతోపాటు దీర్ఘాయువు కూడా!!
ధ్యానం చేయడమంటే కేవలం మంత్రం జపించడం, దేవుడిని తల్చుకోవడం వంటి ఆధ్యాత్మిక భావనే కాదు, అది శారీరక ఆరోగ్యాన్ని భౌతిక మార్గమని, వ్యాయామంలా పనిచేస్తుందని కూడా నిపుణులు అంటున్నారు.

దిశ, ఫీచర్స్ : డైలీ కాసేపు మెడిటేషన్ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని, మానసిక దృఢత్వం ఏర్పడుతుందని పెద్దలు చెబుతుంటారు. ఇది మనసును కంట్రోల్లో ఉంచుకునే అద్భుతమైన సాధనంగా పేర్కొంటారు. నిశ్శబ్దంగా కూర్చొని, శ్వాసపై ధ్యాస ఉంచుతూ అనవసర ఆలోచనలకు, భావోద్వేగాలకు స్వస్తి పలుకుతూ, చుట్టూ ఉన్న వాతారణంపై అవగాహన పెంచుకునేందుకు సహాయపడే గొప్ప టెక్నిక్ ధ్యానం అని అభివర్ణిస్తుంటారు. అయితే ఇది మెదడు సామర్థ్యాన్ని, వయస్సు(Brain age)ను కూడా ప్రభావితం చేయడం ద్వారా వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుందని (Delays aging) అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
ఆరోగ్యం - ఆధ్యాత్మికం
ధ్యానం చేయడమంటే చాలా మంది కేవలం మంత్రం జపించడం, దేవుడిని తల్చుకోవడం వంటి ఆధ్యాత్మిక భావనే కాదు, అది శారీరక ఆరోగ్యాన్ని భౌతిక మార్గమని, వ్యాయామంలా పనిచేస్తుందని కూడా నిపుణులు అంటున్నారు. దేవని నమ్మనివాళ్లు కూడా ఆధ్యాత్మికతో సంబంధం లేకుండానూ మెడిటేషన్ చేయవచ్చు. అంటే ఎవరికి నచ్చిన పద్ధతిలో వారు ఒక విషయంపై మనసును కేంద్రీకరిస్తూ మెడిటేషన్ చేయవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. నచ్చిన వ్యక్తి, వస్తువు, అందమైన ప్రదేశం, దృశ్యం వంటివి కూడా మెడిటేషన్‌లో మీరు కేంద్రీకరించే అంశాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటిని మనసులో పునరావృతం చేసుకోవడం, గైడెడ్ ఇమేజరీ వంటి పద్ధతులను అనుసరించడం కూడా ధ్యానంలో ఒక భాగమని నిపుణులు అంటున్నారు.
పద్ధతి ఏదైనా.. ఫలితం అదే
ఆధ్యాత్మికతో కూడినదైనా, ఆధ్యాత్మికతతో సంబంధలేనిదైనా మనసును ఒక విషయంపై లగ్నం చేయడమే మెడిటేషన్. కాగా ఇది మెదడు సామర్థ్యాన్ని, మెదడు ఆయుష్షును పెంచుతుందని ‘న్యూరో ఇమేజ్’లో పబ్లిషైన ఒక అధ్యయనం పేర్కొన్నది. స్టడీలో భాగంగా పరిశోధకులు దీర్ఘకాలంగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్న వారిని, అలాగే చేయని వారిని కూడా పరిశీలించడంతోపాటు వారి మెదడుకు సంబంధించిన స్కాన్‌లను విశ్లేషించారు. జీవశాస్త్రపరమైన మెదడు వయస్సును(biological brain age) అంచనా వేయడానికి మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌ను వినియోగించారు.
దీర్ఘాయుష్షుకు మార్గం
పరిశోధకులు దీర్ఘకాలంపాటు మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తుల మెదళ్లను(The brains of people who practice meditation), ధ్యానం చేయని వ్యక్తుల మెదళ్లతో పోల్చి చూసినప్పుడు, ధ్యానం చేస్తున్నవారి మెదడు వృద్ధాప్యాన్ని నెమ్మదించిందని, ఎక్కువకాలంపాటు యవ్వనంగా, చురుగ్గా ఉందని గుర్తించారు. 50 ఏండ్ల వయసులో రెండు దశాబ్దాలుగా మెడిటేషన్ చేస్తున్న వారిమెదడు, ఇదే ఏజ్ కలిగి మెడిటేషన్ చేయనివారి మెదడుతో పోల్చి చూడగా.. మెడిటేషన్ చేసేవారి మెదడు సగటున 7.5 సంవత్సరాలు చిన్నదిగా.. అంటే యవ్వనంగా కనిపించిందని పరిశోధకులు వెల్లడించారు. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు కూడా అవసరమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






