- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణాంతకంగా మారుతున్న లివర్ సిర్రోసిస్.. రీజన్ ఏంటో తెలుసా?
మాన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో లివర్ ఒకటి.

దిశ, ఫీచర్స్: మాన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో లివర్ ఒకటి. దీని పనితీరు కొద్దిగా మందగించినా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ మధ్య చాలామందిని లివర్ సిర్రోసిస్ వ్యాధి వేధిస్తున్నట్లు వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రోటీన్ లెవల్స్ బాగా తగ్గడం, కాలేయ కణాలు దెబ్బతినడంవల్ల వాటి సామర్థ్యం తగ్గిపోవడాన్నే లివర్ సిర్రోసిస్‌గా పేర్కొంటారు.
ఇది ప్రాణాంతక వ్యాధి కూడాను. వ్యక్తి తరచూ తీవ్రమైన అలసటకు గురవడం దీని ప్రాథమిక లక్షణాల్లో ఒకటి. వరల్డ్ గ్యాస్ట్రో ఎంలరాజీ ఆర్గనైజేషన్ ప్రకారం.. 2001లో లివర్ సిర్రోసిస్‌తో సుమారు 7 లక్షల 71 వేలమంది మరణించారు. 2020లో సంభవించిన అత్యధిక అనారోగ్య మరణాలకు కారణమైన వాటిలో లివర్ సిర్రోసిస్ కూడా ప్రధానంగా ఉంది.
కారణమిదే..
వైద్య నిపుణుల ప్రకారం భారతదేశంలో లివర్ పనితీరు దెబ్బతినడానికి ప్రధాన కారణం ఆల్కహాల్. దీనికి అడిక్ట్ కావడంవల్ల క్రమంగా సిర్రోసిస్ ప్రాబ్లం తలెత్తుతుంది. అదేవిధంగా హెపటైటిస్ బి, సి, వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ దాడిచేస్తాయి.హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ ఐదారేళ్లకు పైగా కొనసాగినా లివర్ సిర్రోసిస్‌కు దారితీయవచ్చు. ఫ్యాట్ ఇండ్యూస్డ్ లివర్ డ్యామేజ్, ఒబెసిటీ, బ్లడ్ వెజిల్ ఇష్యూస్ బ్లాక్ అవడం కూడా లివర్ సిర్రోసిస్‌కు కారణం అవుతాయి. అయితే 25 నుంచి 30 శాతం వరకు సమస్యలకు ప్రధాన కారణం మాత్రం ఆల్కహాల్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఇండ్యూస్డ్ సిర్రోసిస్ ప్రాబ్లమ్స్ కూడా ఈ మధ్య పెరుగుతున్నాయి.
లక్షణాలు
అత్యంత కామన్ ప్రాబ్లం తీవ్రమైన అలసట. బాడీలో ప్రోటీన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతంది. శరీరంతో పాటు కాళ్లల్లో వాపు కనిపిస్తుంది. పొత్తికడుపులో లిక్విడ్స్ వంటి పదార్థాలు పేరుకుపోవడంతో పొట్ట ఉబ్బినట్లుగా అనిపించవచ్చు. కొన్నిసార్లు వాంతులలో బ్లడ్ పడవచ్చు. కొందరిలో కామెర్ల వ్యాధి తీవ్రమవుతుంది. ఫలితంగా కళ్లు, యూరిన్ ఎల్లో కలర్‌లోకి మారిపోవడం గమనించవచ్చు.
ట్రీట్‌మెంట్
కచ్చితమైన నిర్ధారణ ద్వారా మెరుగైన ట్రీట్‌మెంట్ చేయవచ్చు. హెపటైటిస్ బి, సి మెడికేషన్స్‌తో సిర్రోసిస్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఆల్కహాల్ వల్ల కలిగిన లివర్ డిసీజెస్‌ను కొంత వరకు మెడిసిన్ ద్వారా నివారించవచ్చు. అయితే లివర్ డ్యామేజ్ అయిన సందర్భంలో మాత్రం మెడికేషన్స్ ద్వారా నయం కావడం కష్టమే. ఇలాంటప్పుడు శస్త్ర చికిత్స ద్వారా లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్‌ను డాక్టర్లు సజెస్ చేస్తుంటారు.
ముందుగానే గుర్తిస్తే 75 నుంచి 80 శాతం మందికి మందుల ద్వారా ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది. కానీ చాలామంది సమస్య తీవ్రమై ప్రాణాంతకంగా మారితన తర్వాత డాక్టర్లను సంప్రదిస్తుంటారు. ఈ కారణంగానే ఇండియాలో ప్రతి ఏటా 2 లక్షలకంటే ఎక్కువమందికి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం సిఫార్సు చేయబడుతున్నారు. కాగా 1200 నుంచి 1500 మందికి మాత్రమే అవి సక్సెస్ అవుతున్నాయి.
Read more:






