viral news : వావ్ సూట్ కేస్‌నే కారుగా మార్చేశారుగా..!

by Javid Pasha |

viral news : వావ్ సూట్ కేస్‌నే కారుగా మార్చేశారుగా..!

viral news : వావ్ సూట్ కేస్‌నే కారుగా మార్చేశారుగా..!
X

దిశ, ఫీచర్స్ : మారుతీ, హ్యుందాయ్, స్విఫ్ట్, మెర్సిడెస్ - బెంజ్, రేంజ్ రోవర్ వంటి పలు రకాల కార్ల గురించి మీరు వినే ఉంటారు. కానీ మాజ్డా కార్‌ను ఎప్పుడైనా చూశారా? సాధారణంగా కార్లన్నీ పెద్దగా ఉంటాయి. అందులో నలుగురైదుగురు కూర్చొని జర్నీ చేయవచ్చు. మాజ్డా (Mazda) మాత్రం అలా కాదు. ఇందులో ఒక్కరే వెళ్లగలరు. ఎందుకంటే ఇదొక ‘సూట్ కేస్‌ కారు’ అంటే సూట్‌కేస్ సైజులో, అదే ఆకారంలో తయారు చేసిన అతి చిన్న కారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా నెటిజన్లు తెగ క్యూరియాసిటీని ప్రదర్శిస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.

జర్నీ చేస్తున్నప్పుడు మనం సూట్ కేస్‌ను ఎలాగైతే సర్దుకొని వెంట తీసుకెళ్తామో, మాజ్డా కార్‌ను కూడా అట్లనే తీసుకెళ్లవచ్చు. అవసరమైతే ఓపెన్ చేసి అందులో కూర్చొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లొచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మ్రపముఖ జపనీస్ ఆటోమొబైల్ తయారీ సంస్థ అయిన మాజ్డా మోటార్ కార్పొరేషన్ (Mazda Motor Corporation) దీనిని 1991లో మొదట తయారు చేసింది. ఈ చిన్న సూట్‌కేస్ కారు 34cc టూ - స్ట్రోక్ ఇంజిన్‌(34cc two-stroke engine)తో తయారు చేయగా, గంటకు 30 కి.మీ వేగంతో నడిచే సామర్థ్యం కలిగి ఉంది. కాకపోతే సదరు కంపెనీ ఇంజినీర్లు ఒక ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌లో భాగంగా తమ సృజనాత్మకతను ప్రదర్శించడానికి మాత్రమే దీనిని రూపొందించారు. ఆయా కార్ల ప్రదర్శనల్లో దీనిని ప్రదర్శిస్తుంటారు. దాని చిన్న పరిమాణం కారణంగా రోడ్లపై నడపడానికి, వినియోగించడానికి మాత్రం అనుమతి లేదు.

Next Story