- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పబ్లిక్‌లో ఎదుటివారిని చూస్తూ.. హస్త ప్రయోగం ఎందుకు చేస్తారు?
లైంగిక అవయవాల ప్రదర్శన.. ఎందుకు? కొందరు పబ్లిక్‌లో లైంగిక అవయవాల ప్రదర్శన చేస్తుంటారు. హస్త ప్రయోగంతో ఇతరులను ఇబ్బంది పెడుతుంటారు. ఈ పరిస్థితి ఫేస్ చేసిన వారు ట్రామాలోకి వెళ్లిపోతారు.

దిశ, ఫీచర్స్ : మేడమ్.. కొందరు పబ్లిక్ ప్లేస్‌లలో తమ లైంగిక అవయవాలను ప్రదర్శిస్తుంటారు. హస్తప్రయోగం చేస్తుంటారు. కొందరు అమ్మాయిలు కూడా తమ వక్షోజాలు, పిరుదులు, ప్రైవేట్ పార్ట్స్ ఎదుటివారికి చూపిస్తారు. ఒక్కో సందర్భంలో ముఖ కవళికలతోనూ ఇబ్బంది పెడుతుంటారు. తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తుంటారు. నేను కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కున్నా. ఇదేమైనా రోగమా? ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? - నవ్య, మెదక్
ఇది ఎగ్జిబిషన్ ఇజం. మనో లైంగిక వ్యాధుల వర్గీకరణలో డీఎస్ఎం కింద పెరాఫీలియా కేటగిరీలోకి వస్తుంది. సమాజం అంగీకరించని ప్రవర్తనలు ఈ కోవలోకే వస్తాయి. ఉదాహరణకు పెటిసిజం, వాయురిజం, టచ్రిజం ఇంకా అనేకం ఈ కేటగిరీలోకి వస్తాయి. ఎగ్జిబిషన్ ఇజం అనేది ఒక మానసిక వ్యాధి. ఈ వ్యాధిలో తన శరీరంలోని కొన్ని భాగాలను.. లైంగిక అవయవాలు, వక్షోజాలు, పిరుదులు ఎదుటి వారికి చూపించడం జరుగుతుంది. చూపించడమే కాదు ఏదో ఒక మాట, ముఖ కవళికలతో కూడి ఉంటుంది. ఈ వ్యాధికి గురైన వాళ్ళు ఎదుటివారిని తీవ్ర భయభ్రాంతులకు గురి చేయడమే కాదు వారు కూడా మనో వేదనకు లోనవుతూ ఉంటారు. ఈ వ్యాధికి ఇంకొన్ని పేర్లు ఉన్నాయి. ‘ఫ్లాషింగ్ ఎఫో డైసోఫిలియా’, ‘లేడీ గోండివా గోండివా సిండ్రోమ్’, ‘హ్యాండ్సప్ పేరాఫీలియా’ అని కూడా అంటారు. ‘హ్యాండ్సప్ పేరాఫీలియా’ వ్యాధిగ్రస్తులు మిగతా వ్యాధులలో లాగా ఎదుటివారిపై చేతులు వేయరు. వాళ్ల పరిమితి లేదా లక్షణం లైంగిక అవయవాల ప్రదర్శన మాత్రమే. కొన్నిసార్లు లైంగిక అవయవాలు ప్రదర్శన చేస్తూ హస్తప్రయోగం కూడా చేస్తూ ఉంటారు.
దీనికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేకపోయినా కొన్ని ప్రత్యేకమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
1) పురుష శృంగార హార్మోన్లు అయిన టెస్టోస్టిరాన్ ఎక్కువ స్థాయిలో ఉండటం.
2) బాల్యంలో లైంగిక అత్యాచారాలకు లోనవడం.
3) తమ శరీర దృఢత్వం పైన, లైంగిక అవయవాల సైజు పట్ల విపరీతమైన ఆత్మనూన్యత, అపనమ్మకం, అవిశ్వాసం ఉండటం.
4) తన లైంగిక అవయవాలు చిన్నగా ఉన్నాయని స్నేహితులు చేసే హేళన వల్ల పెళ్లికి, భార్యతో సెక్స్ చేయడానికి అనర్హుడని నమ్మడం. నిరూపించడానికి అమ్మాయిల ముందు తన లైంగిక అవయవాలను హస్త ప్రయోగం చేస్తూ పెరిగిన అంగం ప్రదర్శన చేసి తృప్తి పడడం. ఇలాంటి బాల్యం ఉన్న చాలా మంది పిల్లలు ఈ అసహజ లైంగిక ప్రవర్తనకు లోనవుతున్నట్టు చాలా పరిశోధనలలో తేలింది. మెదడుకు తీవ్రమైన దెబ్బలు తగిలిన వారిలో కూడా ఈ అసహజ లైంగిక ప్రవర్తన మొదలై పెరగడం గమనించారు కూడా.
ఎగ్జిబిషన్ ఇజం చాలా తీవ్రమైన మనో లైంగిక సమస్య ఇది. ప్రదర్శించే వారి బారిన పడ్డవారికి తీవ్రమైన అసహ్యం, భయం, ఆందోళన కలుగుతాయి. మగ పిల్లలు చూస్తే ఆ అసహజ లైంగిక ప్రవర్తనను కాపీ కొడతారు. వాళ్ళు కూడా సమాజానికి, స్త్రీలకు సమస్య అయిపోతారు. అంతేకాదు వాళ్ళు అంటే బాధితులు స్త్రీలైతే వివాహం, పురుషుడు, సెక్స్ పట్ల విముఖత కలిగి పెళ్లి చేసుకోవడానికి భయపడతారు. కాబట్టి ఈ లక్షణాలు గమనించిన వెంటనే పేషెంటును సెక్సాలజిస్ట్ &సైకో థెరపిస్టు వద్దకు తీసుకువెళ్లి తగిన కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఈ చికిత్సల వల్ల రోగి తన లైంగిక అవయవాలను ప్రదర్శించాలనే తీవ్రమైన కోరికను అనుచుకోవడం, వాయిదా వేసుకోవడం లేదా మానేయడం నేర్చుకుంటారు. అలాగే తమ నెగటివ్ ప్రవర్తనకు సంబంధించిన లేదా ప్రోత్సహించే కారణాన్ని కనుక్కునేలా చేస్తారు. ఎందుకు ఈ లైంగిక ప్రవర్తనకు దారితీస్తాయి? ఎలా అధిగమించవచ్చు? అనేది సైకో థెరపీలో ట్రైనింగ్ ఇస్తారు. చైల్డ్‌హుడ్ ట్రామాస్ ఏమన్నా ఉంటే రీ కండిషన్ థెరపీలో రోగి ప్రదర్శన వాంఛను ఎదుటి వ్యక్తికి అంగీకార యోగ్యమైన పాజిటివ్ లైంగిక ప్రవర్తనలోకి మారేలా ట్రైనింగ్ ఇస్తారు. అలాగే సమస్య చాలా తీవ్రంగా ఉన్నప్పుడు సైకియాట్రిస్టును కలిసి మందులు వాడుతూ సైకోథెరపీ తీసుకోవడం చాలా ముఖ్యం.






