వీడియో కాల్‌లో ఉంటే కుక్క మీదెక్కి ఇలా..?! ర‌చ్చ ర‌చ్చే!!

by Disha Web Desk 20 |
వీడియో కాల్‌లో ఉంటే కుక్క మీదెక్కి ఇలా..?! ర‌చ్చ ర‌చ్చే!!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః క‌రోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టించినప్పటి నుండి, దాదాపు ప్రతిదీ ఆన్‌లైన్ మోడ్‌కి మారింది. ముఖ్యంగా, ఉద్యోగాల విష‌యంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. మెజారిటీ కంపెనీలు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌నే స్వాగ‌తిస్తున్నారు.

ఇక్క‌డ‌ వీడియో కాల్స్‌ ముఖ్యమైన భాగంగా మారాయి. ఈ క్ర‌మంలో ఇంట‌ర్నెట్ నిండా ఈ సంద‌ర్భానికి సంబంధించిన అనుభ‌వాలు పోస్ట్ చేస్తున్నారంతా. వీడియో కాల్స్ స‌మ‌యంలో పిల్లలో, ఇతర కుటుంబ సభ్యులో, లేదంటే పెంపుడు జంతువులో అంతరాయం కలిగించే వీడియోలు ఎక్కువ‌య్యాయి. ఇక్క‌డ కూడా అదే జ‌రిగింది. ఓ వ్య‌క్తి, త‌న కంపెనీకి సంబంధించిన ప‌నిలో వీడియో కాల్ మాట్లాడుతుండ‌గా భారీ శరీరం గ‌ల ఓడిన్‌ త‌న య‌జ‌మాని ఆండ్రూ మీద‌కెక్కి ర‌చ్చ ర‌చ్చ చేసింది.




ఇంగ్లాండ్‌లో మెయింటెనెన్స్, ఫెసిలిటీస్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న 53 ఏళ్ల ఆండ్రూ స్టాల్‌వుడ్ వీడియో కాల్‌లో ఉన్నప్పుడు అతని రెండేళ్ల కుక్క ఓడిన్ ఒళ్లో ఎక్కి, భుజాల‌పైన‌, త‌ల‌పైన ఎక్కి డిస్ట్ర‌బ్ చేసింది. బొచ్చుతో పెద్ద శరీరం గ‌ల‌ కార్పాతియన్ షెపర్డ్ అయిన ఓడిన్, ఆండ్రూ ఎంత వారించినా ఒడిలో నుండి దిగడానికి నిరాకరించింది. వీడియో ముందు తన బొచ్చు తోకను ఊపుతూ సంద‌డి చేసింది. ఇక‌, ఈ స‌ర‌దా క్షణాల‌ను చూసిన‌ ఆండ్రూ క‌జిన్‌ లారెంజాడే అష్టన్ స‌ద‌రు దృశ్యాల‌ను కెమెరాలో బంధించారు. ఇప్పుడు అవే ఫోటోలు ఇంట‌ర్నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అంద‌రూ, ఓడిన్ చేసిన ఓవ‌ర్ యాక్ష‌న్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.





Next Story

Most Viewed