- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kids and Parenting : పిల్లల ఎదుగుదలకు మసాజ్ థెరపీ.. పేరెంట్స్ చేయాల్సింది ఇదే..!
Kids and Parenting : పిల్లల ఎదుగుదలకు మసాజ్ థెరపీ.. పేరెంట్స్ చేయాల్సింది ఇదే..!

దిశ, ఫీచర్స్ : చిన్న పిల్లల ఆరోగ్యం ఎలా ఉండాలనేది చాలా వరకు పేరెంట్స్ చేతిలోనే ఉంటుందంటారు వైద్య నిపుణులు. అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని ఐదారేండ్ల వయసు వచ్చేవరకైతే మరీ జాగ్రత్త అవసరమని చెబుతారు. అయితే ప్రతిదీ వైద్య సంబంధిత అంశంతోనే ముడిపడి ఉండదు. తల్లిదండ్రులో, సంరక్షకులో సొంతంగా పాటించాల్సిన చిట్కాలు సైతం వైద్యంతో సమానంగా పనిచేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాంటి వాటిలో మసాజ్ థెరపీ ఒకటి.
* ఒకరోజు శిశువు మొదలుకొని ఐదేండ్ల పిల్లల వరకు పాదాలకు, శరీరానికి, తలకు కొబ్బరి లేదా బాదం వంటి తేలికపాటి నూనెలతో సున్నితంగా మసాజ్ చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది పిల్లల్లో రక్త ప్రసరణను మెరుగు పరిచి, నిద్రను ప్రేరేపించడంవల్ల వారి శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుంది. అలసట, నొప్పి వంటి ఇబ్బందులను దూరం చేస్తుంది.
* మసాజ్ చేయడం అవసరమే కానీ, ఈ సందర్భంగా జాగ్రత్త కూడా చాలా ముఖ్యం. అనుభవజ్ఞులైన పెద్దలు లేదా వైద్య నిపుణుల సహాయం తీసుకోవచ్చు. ఇక ఐదారేండ్ల పిల్లలైతే ప్రతిరోజూ బడికి వెళ్లిరావడం, ఒత్తిడితో కూడిన చదువులు, సామాజిక పరస్పర చర్యలు వంటి వాటివల్ల ఒత్తిడికి గురవుతుంటారు. ఇలాంటప్పుడు పాదాలు మొదలు కొని వీపు భాగం, తల భాగంలో మసాజ్ చేయడం వల్ల పిల్లల్లో ఒత్తిడి దూరం దూరమై, ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే మసాజ్ వల్ల రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. చక్కగా నిద్రపడుతుంది. ఫలితంగా మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగు పడుతుందని, రోగనిరోధక శక్తి మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






