Technology : iPhone.. ఎందుకంత సేఫ్?

by Javid Pasha |

ఐఫోన్‌లో ఒక విధమైన లేయర్ సెక్యూరిటీ సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది. ఇది మీ పాస్‌వర్డ్‌లు, చెల్లింపులు, ఐడెంటిటీ, కమ్యూనికేషన్‌లను సురక్షితంగా ఉంచుతుంది.

Technology : iPhone.. ఎందుకంత సేఫ్?
X

దిశ, ఫీచర్స్ : మిగతా బ్రాండ్లతో పోలిస్తే సెక్యూరిటీ పరంగా యాపిల్‌ఫోన్ చాలా సేఫ్ అంటుంటారు యూజర్లు. ఒక్క ఫోన్ మాత్రమే కాదు. యాపిల్ సంస్థకు చెందిన ఇతర పరికరాలను కూడా సైబర్ సురక్షితంగా ఉంటాయి. అందుకు కారణం వీటిలో ఒక లేయర్డ్ సెక్యూరిటీ సిస్టమ్ నిశ్శబ్దంగా నడుస్తుందని, అది మీ ఫోన్‌ను, ఆన్‌లైన్ వ్యవహారాలను సురక్షితంగా ఉంచుతుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. అదెలా? ఏ ఫీచర్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం పదండి!

ఐఫోన్‌(iPhone)లో లేదా యాపిల్ పరికరాల్లో ఒక విధమైన లేయర్ సెక్యూరిటీ సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది. ఇది మీ పాస్‌వర్డ్‌లు, చెల్లింపులు, ఐడెంటిటీ అండ్ కమ్యూనికేషన్‌లను నిశ్శబ్దంగా, సురక్షితంగా నడిపిస్తుంటాయి. ముఖ్యంగా ఈ విధమైన ప్రక్రియను ఎన్‌క్రిప్షన్, హార్డ్‌వేర్ సేఫ్‌గార్డ్‌లు, అలాగే ఆన్-డివైస్ ప్రాసెసింగ్ ద్వారా రక్షిస్తుంది. అంటే ఈ వ్యవస్థ ప్రధానంగా ప్రైవసీని పర్యవేక్షిస్తూ.. మోసాలు, ఫిషింగ్ అండ్ ఐడెంటిటీ థెఫ్ట్ వంటి విషయాల్లో హ్యాకర్లను అడ్డుకుంటుంది. ఐపీ అడ్రస్‌లను, బ్రౌజింగ్‌ను సేఫ్‌గా ఉంచుతుంది. అందుకోసం యాపిల్ ఫోన్ లేదా పరికరాల్లోని ప్రతీ ఫీచర్ ప్రత్యేక విధులను కలిగి ఉంటుంది.

Secure Enclave Chip

ఇది యాపిల్ పరికరాల్లో హార్డ్‌వేర్ స్థాయిలో బయోమెట్రిక్ డేటా (Face ID, Touch ID), ఎన్‌క్రిప్షన్ కీలు, అలాగే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ను ఐసోలేట్ చేసి రక్షిస్తుంది. సాఫ్ట్‌వేర్ ఎటాక్‌లు లేదా హ్యాకర్లు ఈ డేటాను యాక్సెస్ చేయలేరు. ఎందుకంటే ఇది లేదా హ్యాకర్లు ఈ డేటాను యాక్సెస్ చేయలేరు, ఎందుకంటే ఇది సపరేట్ చిప్‌లో సేఫ్‌గా ఉంటుంది.

Hide my email

రాండమ్, యూనిక్ ఈమెయిల్ ఎలియాస్‌లను క్రియేట్ చేసి(Create email aliases) మీ అసలు ఈ మెయిల్ అడ్రస్‌ను దాచి రక్షిస్తుంది. స్పామ్, ట్రాకింగ్ లేదా ఐడెంటిటీ థెఫ్ట్ నుంచి మీ ఇన్‌బాక్స్‌లను కాపాడుతుంది. ఈమెయిల్స్ మీకు ఫార్వార్డ్ అవుతాయి కానీ.. మీ రియల్ అడ్రస్ బయటపడదు.

Apple Pay

టోకనైజ్డ్ (Device Account Number) కార్డ్ నంబర్లను ఉపయోగిస్తుంది. అసలు ఈ కార్డ్ డీటెయిల్స్ మర్చంట్‌కు లేదా యాపిల్‌కు కూడా షేర్ కావు. డివైజ్‌లోని Secure Elementలో స్టోర్ అవుతుంది. ప్రతీ ట్రాన్జాక్షన్‌కు యూనిక్ టోకెన్ జనరేట్ అవుతుంది. ఇది ఫ్రాడ్, కార్డ్ డేటా దొంగతనం నుంచి రక్షిస్తుంది.

Pass Keys

పాస్‌వర్డ్స్ బదులు క్రిప్టోగ్రాఫిక్ కీలతో సైన్-ఇన్ చేస్తాయి. ప్రయివేట్ కీ ఎప్పుడై డివైజ్ నుంచి బయటకు వెళ్లదు. సర్వర్‌లో కూడా స్టోర్ కాదు. ఫిషింగ్ అటాక్స్ దాదాపు అసాధ్యం. పాస్‌వర్డ్ లీక్‌లు జరిగే చాన్స్ ఏమాత్రం ఉండదు.

iCloud Private Relay

సఫారి (Safari) బ్రౌజింగ్ సమయంలో మీ ఐపీ అడ్రస్‌ను దాచి, వెబ్‌సైట్స్ మీ లొకేషన్ లేదా బ్రౌజింగ్ హిస్టరీని ట్రాక్ చేయకుండా చేస్తుంది. మల్టీ-హాప్ ఆర్కిటెక్చర్‌తో రిక్వెస్ట్‌లు రెండు వేర్వేరు రిలేస్ ద్వారా వెళ్తాయి. కాబట్టి ఈ ఫీచర్ ప్రైవసీని పెంచుతుంది.

Call Screening / Message Screening

అజ్ఞాత నంబర్ల(Unknown numbers) నుంచి కాల్స్‌ను లేదా మెసేజ్‌లను లోకల్‌గా(డివైజ్‌పైనే) స్క్రీన్ చేసి, స్పామ్ ఫిషింగ్‌ను బ్లాక్ చేస్తుంది. రియల్ టైమ్ ట్రాన్స్‌క్రిప్షన్ లేదా క్వారంటైన్ చేసి, మీరు అలో చేసినప్పుడే అలర్ట్ ఇస్తుంది. స్కామ్‌ల రక్షిస్తుంది.

Stolen Device Protection

ఫోన్ ఎవరైనా కొట్టేస్తే.. ముఖ్యంగా లొకేషన్, నెట్వర్క్ సరిగ్గా లేని ప్రాంతాల్లో ఇది జరిగితే.. పాస్‌వర్డ్ మార్చడం, డేటా యాక్సెస్‌ను అరికట్టడం వంటి కీలక చర్యలకు ఉపయోగపడుతుంది. అయితే Face ID/Touch ID తప్పనిసరి. ఒక గంట వరకు ఇది సెక్యూరిటీ డిలే విధిస్తుంది. అకౌంట్ టేకోవర్లు, సెన్సిటివ్ చేంజ్‌లను నిరోధిస్తుంది.

Next Story