సిద్దిపేట TO లడఖ్.. స్కూటీపై ఓ యువకుడి సాహసయాత్ర

by Javid Pasha |

సిద్దిపేట TO లడఖ్.. స్కూటీపై ఓ యువకుడి సాహసయాత్ర

సిద్దిపేట TO లడఖ్.. స్కూటీపై ఓ యువకుడి సాహసయాత్ర
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : బైక్ రైడర్ .. అనగానే ఖరీదైన స్పోర్ట్స్ బైక్ లే గుర్తొస్తాయి. పెద్ద బైక్ లు ఉంటేనే సాహసయాత్రలు చేయొచ్చు అనుకుంటాం. కానీ చేయాలన్న తపన ఉంటే.. చేతిలో ఉన్న ఏ బండిపైన అయినా సంతోషంగా యాత్ర చేయొచ్చు. సిద్దిపేట కు చెందిన యువకుడు ఒంటరిగా స్కూటీపై 6300 కిలో మీటర్లు ప్రయాణించి ఔరా అనిపించుకున్నాడు.

చలో లడఖ్..

సిద్దిపేట పట్టణానికి చెందిన మాంకాల శ్రీనివాస్, అనిత దంపతులకు ఇద్దరు కుమారులు. అందులో పెద్ద కుమారుడు మాంకాల ప్రణయ్ కుమార్ పదవ తరగతి పూర్తి చేసి.. ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేట్ ఉద్యోగంలో చేరాడు. స్వంతంగా టీ వ్యాపారం ప్రారంభించి.. వచ్చిన ఆదాయంతో వాహనంపై యాత్రలు చేయడం హాబీగా చేసుకున్నాడు. ఇటీవల సిద్దిపేట నుంచి లడక్ వరకు వెళ్లి తిరిగి సిద్దిపేట వరకు 6300 కిలోమీటర్లు దూరం 23 రోజుల్లో ప్రయాణించాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాణించి, రాత్రి సమయంలో రెస్ట్ తీసుకున్నట్టు ప్రణయ్ తెలిపాడు.

12 రాష్ట్రాల మీదుగా..

ప్రణయ్ సాహస యాత్ర తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, చండీఘర్ తదితర 12 రాష్ట్రాల మీదుగా సముద్ర తీరానికి 17,982 వేల అడుగుల ఎత్తులోని లాడక్ ప్రాంతానికి చేరుకున్నాడు.

ఫస్ట్ రైడ్ విజయ వాడకు..

రైడింగ్ మీద ఆసక్తితో ప్రణయ్ కుమార్ మొదట విజయవాడకు స్కూటీ వాహనం పై వెళ్లాడు. తదనంతరం 3 సంవత్సరాల వ్యవధిలో అరకు, తమిళనాడు ఊటీ, కొడై కనాల్, కోయంబత్తూర్, అరుణాచలం, మధురై, శ్రీ శైలం, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లి వచ్చాడు.

Next Story