- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వంటింట్లోకి వెళ్లాలంటేనే వణికిపోయి మంజు.. వందలమంది చెఫ్‌లను తయారుచేసింది.!
ఒకసారి మంజు మిట్టల్ వంట చరిత్రేంటో తెలుసుకొని ముందుకెళ్దాం.

పోటీ ప్రపంచంలో..
ఫస్ట్ తెలియాల్సింది వంట.
మన వంట మనం చేసుకుంటే..
ఆరోగ్యం బాగుంటుంది.
సమయం ఆదా అవుతుంది.
ప్రొఫెషనల్‌గానూ అక్కెరకొస్తుంది.
ఒకసారి మంజు మిట్టల్ వంట చరిత్రేంటో తెలుసుకొని ముందుకెళ్దాం.
- దిశ, ఫీచర్స్
మంజు మిట్టల్ ఒకప్పుడు కిచెన్‌లో రిలాక్సయ్యేది. ఇష్టమొచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసి సంతోషపడేది. అయితే తన ఎనిమిదేళ్ల పాప ఉన్నట్టుండి మెనింజైస్ వ్యాధితో చనిపోయింది. ఇక అప్పటి నుంచి వంటింట్లోకే వెళ్లలేదు. పాప మరణంతో ఒంటరిగా ఫీలయ్యింది. డిప్రెషన్లోకి వెళ్లిపోయింది.
బాధ నుంచి బయటకు
కూతురు మరణంతో బాధపడుతున్న మంజు మిట్టల్ జీవితాన్ని ఒక చిన్న సంఘటన మలుపుతిప్పింది. తన ఉనికి కోసం కాకుండా తన జ్ఞానం కోసం తీసుకున్న స్టెప్ ఇది. నిశ్శబ్దంగా మారిన తన జీవితాన్ని తిరిగి ప్రారంభించాలనే తాపత్రయంతో ప్రారంభమైన జర్నీ. కొడుకు పుట్టినరోజు సందర్భంగా తప్పనిసరి పరిస్థితుల్లో మంజు మళ్లొకసారి వంటింట్లోకి అడుగుపెట్టింది. ఈ ఒక్కసారికే అని కుటుంబం కోసం వంట చేసిన ఆ క్షణం.. ఆమెలో నిద్రాణంగా ఉన్న చెఫ్‌ను మేల్కొలిపింది. డిప్రెషన్‌లో ఉన్న వదినకు కిచెన్‌తోనే కొత్త జీవితాన్ని ప్రసాదించాలని మంజువాళ్ల మరిది "వంట నేర్పించొచ్చు" కదా అని సలహా ఇచ్చి కొత్త మార్గాన్ని పరిచయం చేశాడు.
వెయ్యి మందికి..
మంజు తొలుత ఒక విద్యార్థిని ఇంట్లోనే వంట నేర్పించడం ప్రారంభించింది. క్రమంగా ఇద్దరు.. ముగ్గురు.. పెరుగుతూ వందలమంది అయ్యారు. ఆమె కేవలం వంట విధానాలను మాత్రమేకాక.. జీవితాన్ని పునర్మించే నైపుణ్యాలను.. ఆశలను.. నిర్మాణాత్మక దృక్పథాన్ని అందిస్తున్నానని గ్రహించింది. మంజు నిర్వహిస్తున్న క్లాసుల వల్ల నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయిల మధ్య కమ్యూనికేషన్.. వృత్తి నైపుణ్యాలను మెరుగుపరిచే అవకాశం దొరికింది. బోధనలో స్మార్ట్ టెక్నిక్‌లు.. సమయాన్ని ఆదాచేసే నైపుణ్యాలు.. రోజువారీ జీవితాన్ని సులభతరం చేసే చిన్న చిన్న ఐడియాలపై దృష్టి సారించింది. అమ్మాయిలకు వంటల పాఠాలు చెప్తూనే తన జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లింది.
వారిలో బిడ్డను చూస్తూ..
ఇప్పుడు ఆమె ప్రభావం.. పరిసరాలకు మాత్రమే పరిమితం కాలేదు. వంట.. గృహనిర్వహణ మెలకువలతో నిండిన తన వీడియోలు లక్షలాది మందికి చేరువయ్యాయి. ముఖ్యంగా మంజు స్వయంగా వెయ్యి మందికి పైగా యువతులకు శిక్షణ ఇచ్చిన విధానం.. తన కుమార్తె స్మరణగా బయటకొచ్చిన జ్ఞానం.. శ్రద్ధ ప్రతీ వీడియోలో కనిపిస్తాయి. ఇది మంజు కేవలం వంట కోసమే స్థాపించిన పాఠశాల కాదు. యువతుల నైపుణ్యాలతో పాటు ఆత్మ విశ్వాసాన్ని పొందే ఒక సంరక్షణ కేంద్రంగా చెప్పుకుంటున్నారు. విద్యార్థులు మంజును ఒక గురువుగా మాత్రమే కాకుండా.. జీవితంలో స్థిరమైన మార్గదర్శకత్వం చేసిన ఆదర్శమూర్తిగా భావిస్తారు. ప్రతీ విద్యార్థిలో తన బిడ్డను చూసుకుంటోంది.






