- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యాన్సర్ వచ్చిందంటే కీమోథెరపీ చేయించాల్సిందేనా?
క్యాన్ అసిస్ట్ బ్రెస్ట్.. ఏఐ క్యాన్సర్ టెస్ట్.. కీమోథెరపీ అవసరమో లేదో చెప్పేస్తుంది.. ఇండియాతోపాటు పలు దేశాల్లో వినియోగం.. సామాన్యులకు అందుబాటు ధరలో టెస్ట్ ప్రైస్

దిశ, ఫీచర్స్: క్యాన్సర్ అనగానే బెంబేలెత్తి పోతుంటారు. ఇక కీమోథెరఫీయే అని టెన్షన్ పడుతుంటారు. క్యాన్సర్ రాగానే చనిపోతారని.. లక్షణాలు కనిపించగానే కీమోథెరఫీ చేయాల్సిందే అనుకోవద్దు అంటోంది మంజిరి బక్రే అనే సైంటిస్ట్.
ఫ్రెండ్ మరణంతో..
మంజిరి బక్రే అభివృద్ధి చేసిన క్యాన్ అసిస్ట్ బ్రెస్ట్ (క్యాబ్) టెస్ట్ రొమ్ము క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ అవసరమా లేదా అని సులభంగా నిర్ణయించడానికి సహాయపడుతోంది. మంజిరి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు తన స్నేహితురాలికి రొమ్ము క్యాన్సర్ వచ్చింది. ట్యూమర్ తొలగించి చికిత్స తీసుకున్నా క్యాన్సర్ మళ్లీ మళ్లీ వచ్చి చివరికి ఆమె మరణించింది. చిన్న ట్యూమర్ ఉన్నప్పుడే ఆ క్యాన్సర్ ఎంత ఆక్రమణాత్మకంగా ఉంటుందో ముందే చెప్పగలమా? అని మంజిరి ఆలోచనలో పడింది. ఈ ప్రశ్నే కొత్త టెస్ట్ అభివృద్ధి చేయడానికి ప్రేరేపించింది.
రెండు కేటగిరీలు..
2011లో ఆమె ఆంకోస్టెమ్ అనే కంపెనీని ప్రారంభించి తక్కువ ఖర్చుతో.. ఖచ్చితమైన.. సులభంగా చేయగలిగే ప్రొగ్నోస్టిక్ టెస్ట్ రూపొందించింది. ఇది ఏఐ ఆధారిత అల్గారిథమ్ ఆధారంగా రోగి ట్యూమర్ నమూనా నుంచి 1-100 వరకు రికరెన్స్ రిస్క్ స్కోర్ ఇస్తుంది. దీన్నిబట్టి ‘లో రిస్క్’ లేదా ‘హై రిస్క్’గా వర్గీకరిస్తుంది. లో రిస్క్ అంటే సుమారు 70% రోగులకు కీమోథెరపీ ఎక్కువ ప్రయోజనం ఇవ్వదు. దీన్ని పూర్తిగా మానేయవచ్చు. ఇది రోగికి శారీరక.. మానసిక ఇబ్బందులు.. ఆర్థిక భారం నుంచి రక్షణిస్తుంది. హై రిస్క్ రోగులకు కీమోథెరపీతో సహా ఇతర చికిత్సలు అవసరమని స్పష్టమైన సూచన లభిస్తుంది.
రిస్క్ స్కోర్ లెక్కిస్తుంది..
ఈ టెస్ట్ ఆపరేషన్ సమయంలో తొలగించిన రొమ్ము ట్యూమర్ కణజాలంపై చేస్తారు. ట్యూమర్ సైజు 5 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్న ప్రారంభ దశ రోగులకు ఇది ఉపయోగపడుతుంది. ఈ టెస్ట్.. ఎస్ట్రోజెన్ రిసెప్టర్ (ఈఆర్).. ప్రొజెస్టెరాన్ రిసెప్టర్ (పీఆర్) ఉన్నవారికి హెచ్ఈఆర్2/ఎన్ఈయూ రిసెప్టర్ లేని వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ రోగులకు ఎండోక్రైన్ థెరపీ అంటే నోటి ద్వారా మందులు ఇవ్వడం చాలా ప్రయోజనకరం. హెచ్ఈఆర్2 లేకపోవడం వల్ల ట్యూమర్ తక్కువ ఆక్రమణాత్మకంగా ఉంటుందట. ట్యూమర్ సైజు.. గ్రేడ్.. లింఫ్ నోడ్ స్థితితో కలిపి ఏఐ అల్గారిథమ్ రిస్క్ స్కోర్ లెక్కిస్తుంది. ప్రపంచంలోని ప్రముఖ టెస్ట్ ఆంకోటైప్ డీఎక్స్ ఖర్చు కొన్ని లక్షలు. కాగా మంజిరి రూపొందించిన క్యాన్ అసిస్ట్ బ్రెస్ట్ టెస్ట్ కేవలం రూ.65000 మాత్రమే. ఇండియా.. శ్రీలంక.. బంగ్లాదేశ్.. టర్కీ.. యూఏఈ దేశాల్లో టెస్ట్‌ను ఉపయోగిస్తున్నారు.






