- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Manchu Lakshmi: తమ్ముడిని చూసి ఏడ్చేసిన మంచులక్ష్మీ..వీడియో వైరల్
Manchu Lakshmi: తన తమ్ముడు మంచు మనోజ్ ను చూసి ఆయన అక్క మంచు లక్ష్మీ ఎమోషనల్ అయ్యింది.

దిశ, వెబ్ డెస్క్: Manchu Lakshmi: తన తమ్ముడు మంచు మనోజ్ ను చూసి ఆయన అక్క మంచు లక్ష్మీ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనలు అందించాలనే లక్ష్యంతో నటి మంచు లక్ష్మీ నిర్వహిస్తూన్న సేవా కార్యక్రమం టీచ్ ఫర్ ఛేంజ్. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ వేదికగా ప్రతి సంవత్సరం సెలబ్రిటీ ఫ్యాషన్ షోను నిర్వహిస్తుంటారు. శనివారం రాత్రి జరిగిన ఈవెంట్ లో తన సోదరిని సర్ ప్రైజ్ చేస్తూ నటుడు మనోజ్ , ఆయన సతీమణి మౌనిక కూడా పాల్గొన్నారు. మనోజ్ ను చూసిన వెంటనే లక్ష్మీ ఎమోషనల్ అయ్యారు. ఆయన్ని ప్రేమగా హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. పక్కనే ఉన్న మౌనిక ఆమెను ఓదార్చారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నిన్న జరిగిన ఈ ఈవెంట్లో నటీనటులు రియా చక్రవర్తి, కేతికా శర్మ, అనసూయ సందడి చేశారు.
కుటుంబ సభ్యుల మధ్య సమస్యలతో సతమతమవుతున్న తమ్ముడు మంచు మనోజ్ ని ఓ ఫంక్షన్లో చూడగానే కంటనీరు పెట్టుకుని ఎమోషనల్ అయిన మంచు లక్ష్మి,అక్కా తమ్ముళ్ళను ఓదార్చిన మౌనిక.... pic.twitter.com/EJB9J6bMkA
— Swathi Reddy (@Swathireddytdp) April 13, 2025






