24 అంతస్తుల టవర్స్.. నగరంలో ‘మకుట తరంగా’ ప్రాజెక్టు లాంచ్

by Daayi Srishailam |

ఆధునిక నగర జీవనానికి నూతన మకుటం

24 అంతస్తుల టవర్స్.. నగరంలో ‘మకుట తరంగా’ ప్రాజెక్టు లాంచ్
X

దిశ, మేడ్చల్ బ్యూరో: కొనుగోలుదారుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రశాంతమైన వాతావరణంలో నూతన సాంకేతికతను మేళవించి ‘మకుట తరంగా’ ఆల్ట్రా లగ్జరీ రెసిడెన్స్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నామని మకుట డెవలపర్స్ చైర్మన్ కొంపల్లి జనార్ధన్ పేర్కొన్నారు. కూకట్ పల్లి ఐడియల్ లేక్ అశోక వన్ మాల్ వెనుక వైపు మకుట డెవలపర్స్ వారు చేపట్టిన మకుట తరంగా నూతన ప్రాజెక్ట్ లాంచ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆధునిక నగర జీవనానికి అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలు, ప్రశాంతత వాతావరణంలో ఈ ప్రాజెక్టు ఉండబోతుందని చెప్పారు. కేవలం ఇండ్లను నిర్మించడమే కాకుండా హైదరాబాద్ వంటి మహానగరంలో కొత్త ప్రమాణాలను సృష్టించబోతుందని పేర్కొన్నారు. మొదటి మూడు నెలల కాలంలో 100 యూనిట్ల అమ్మకాలు లక్ష్యంగా ప్రాజెక్టును ఆవిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు.

మకుట తరంగ ప్రాజెక్టు విశేషాలు

కూకట్ పల్లి ఐడీఎల్ చెరువు అశోక వన్ మాల్ వెనుక వైపు 2.8 ఎకరాల విస్తీర్ణంలో, 24 అంతస్తుల టవర్స్ లో 250 విలాసవంతమైన నివాస యూనిట్లు ఉంటుండగా, వీటిలో 80 శాతం వరకు కార్నర్ యూనిట్లు వచ్చే విధంగా నిర్మించనున్నారు. ప్రతి ఫ్లాట్‌లో 10.35 అడుగుల ఎత్తైన సీలింగ్, కార్నర్ యూనిట్లకు ప్రత్యేక ఫోయర్, ఫ్లోర్-టు-సీలింగ్ గ్లాస్ గోడలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దీనివలన సహజ కాంతి విరివిగా చేరి, అద్భుతమైన ఐడియల్ సరస్సు దృశ్యాలు వీక్షించే సాలభ్యం కొనుగోలు దారులకు కలుగనున్నదని మకుట డెవలపర్స్ యాజమాన్యం పేర్కొన్నది

Next Story