బలాన్నిచ్చే ఇంటి చిట్కాలు.. మహిళలు తప్పక తినాల్సిన ఆహారాలివే.. !

by Javid Pasha |   (  Updated:2025-11-07 14:22:32  IST  )

ఆవాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (ALA), లిగ్నాన్స్ అధికం. కాబట్టి వీటిని తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

బలాన్నిచ్చే ఇంటి చిట్కాలు.. మహిళలు తప్పక తినాల్సిన ఆహారాలివే.. !
X

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా ఉండాలనుకుంటే సరిపోదు. అందుకు సరైన పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలంటారు ఆరోగ్య నిపుణులు. మనం తినే రోజువారీ ఆహారాల ద్వారా అవి లభిస్తాయి. కానీ సమయానికి తినకపోవడం, సరిగ్గా తినకపోవడమో సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా గృహిణులు కుటుంబం మొత్తానికి ఆహారం వండి వడ్డిస్తుంటారు. కానీ వారు మాత్రం సమయానికి తినరు. అందరి ఆరోగ్యం గురించి ఆలోచించే వీరు, చాలా వరకు తమ ఆరోగ్యం గురించి పెద్దగా ఫోకస్ చేయరు. దీంతో అలసట, అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా జరగకూడదంటే మహిళలు తప్పక తీసుకోవాల్సిన కొన్ని పోషక పదార్థాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు. అవేమిటో, ఏ విధంగా మేలు చేస్తాయో చూద్దాం.

మఖానా (ఫాక్స్ నట్స్ / లోటస్ సీడ్స్)

మఖానాను ఆహారంగా తీసుకోవడంవల్ల కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా లభిస్తాయి. జాయింట్లు బలపడతాయి. ఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది. ముఖ్యంగా మహిళల్లో హార్మోనల్ బ్యాలెన్స్‌కు సహాయపడతాయి. కాబట్టి రోజూ 20-30 గ్రాములు రోస్ట్ చేసి లేదా మిల్క్‌లో వేసుకొని తినాలి.

ఆవాల గింజలు (ఫ్లాక్స్‌సీడ్స్)

ఆవాలా గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (ALA), లిగ్నాన్స్ అధికం. కాబట్టి వీటిని తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెనోపాజ్ లక్షణాలు (హాట్ ఫ్లాషెస్, మూడ్ స్వింగ్స్) తగ్గుతాయి. ఆయుర్వేదం ప్రకారం ‘వాత శమనం’ చేసి జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. కాబట్టి ఒక టీ స్పూన్ లో నిండా ఆవాల పొడిని స్మూతీ, దోసె, రొట్టె వంటి వాటితో కలిపి తినాలి.

మునగకాయ (డ్రమ్‌స్టిక్ / మోరింగా)

మునగలో విటమిన్ సి, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి అనీమియా (రక్తహీనత) తగ్గించడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. మునగ తినేవారిలో యవ్వనఛాయలు ఎక్కువకాలం ఉంటాయి. వృద్ధాప్యం త్వరగా రాదు. సూప్, కూర, లేదా పొడి (మోరింగా పౌడర్) రూపంలో మునగను ఆహారంగా తీసుకోవచ్చు.

ఖర్జూరం పండ్లు

ఖర్జూరాల్లో ఐరన్, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటుంది. తక్షణ శక్తిని ఇస్తుంది. వీటిని తింటే హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. కాబట్టి మహిళలు తప్పక తినాలంటున్నారు నిపుణులు. జీర్ణక్రియ మెరుగుపర్చడంలో, మలబద్ధకాన్ని పోగొట్టడంలో ఖర్జూరాలు అద్భుతంగా పనిచేస్తాయి. డైలీ 3 నుంచి 5 ఖర్జూరాలు తినవచ్చు. Link

Next Story