- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ లోపంతో డయాబెటిస్ రిస్క్.. నియంత్రణ ఎలా?
మెగ్నీషియంలో లోపం టైప్ 2 డయాబెటిస్ రిస్క్‌ను పెంచుతుంది. రక్తంలో చక్కెరస్థాయిల నియంత్రణపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

దిశ, ఫీచర్స్ : శరీరంలో మెగ్నీషియంలో లోపం టైప్ 2 డయాబెటిస్ రిస్క్‌ను పెంచుతుందా? అవుననే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది రక్తంలో చక్కెరస్థాయిల నియంత్రణపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇన్సులిన్ హార్మోన్ పనితీరులో, గ్లూకోజ్ మెటబాలిజంలో, ఎనర్జీని అందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి శరీరంలో దీని స్థాయిలు పడిపోతే ఇన్సులిన్ రిసెప్టర్లపై టైరోసిన్ కైనేస్(tyrosine kinase). యాక్టివిటీ దెబ్బతింటుంది. దీంతో సెల్స్ ఇన్సులిన్‌కు సరిగా స్పందించకపోవడంతో గ్లూకోజ్ గ్రహణం తగ్గుతుంది. ఈ పరిస్థితి కాలక్రమేణా ఇన్సులిన్ నిరోధకతకు దారితీసి టైప్ -2 డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుందని నిపుణులు చెబుతన్నారు.
గ్లూకోజ్ నియంత్రణ
అధ్యయనాల ప్రకారం.. మెగ్నీషియం లోపం ఉన్నారిలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ షుగర్, గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు చెబుతన్నారు. అయితే మెగ్నీషియం సప్లిమెంటేషన్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పరచి, గ్లూకోజ్ నియంత్రణలో సహాయపడుతుందని కూడా అనేక ర్యాండమైజ్డ్ ట్రయల్స్ చూపించాయి. అయితే దీని ఉద్దేశం లోపాన్ని అధిగమించడానికి కేవలం సప్లిమెంట్లు మాత్రమే తీసుకోవాలని కాదు. ఈ విషయంలో డాక్టర్ సలహా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
వీటిని తింటే బెటర్
మెగ్నీషియం స్థాయిలు ఎక్కువగా పడిపోతుంటే.. టైప్ 2 డయాబెటిస్ రిస్క్ మరింత పెరుగుతుంది. కాబట్టి సహజమైన ఆహారాల ద్వారా దానిని పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పాలకూర, బచ్చలికూర, తోటకూర సహా అన్ని ఆకుకూరల్లో ఇది లభిస్తుంది. అలాగే బాదం, కాజు, గుమ్మడి గింజల్లోనూ ఇది పుష్కలంగా ఉంటుంది. చియాసీడ్స్, అవిసె గింజలు, అవకాడో, చార్క్ చాక్లెట్, బీన్స్, ఓట్స్, బ్రౌన్ రైస్, తృణ ధాన్యాల్లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి రోజువారీ ఆహారాల్లో భాగంగా వీటిని తప్పక తీసుకుంటూ ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.






