PhonePe: మేడమ్ రాక్స్ ఫోన్ పే షాక్స్.. నవ్వులు పూయిస్తున్న ట్రాన్సాక్షన్

by Chukka Sudharani |

తరాలు మారుతున్నా కొద్ది భాషలో కూడా చాలా చేంజెస్ వచ్చేస్తున్నాయి.

PhonePe: మేడమ్ రాక్స్ ఫోన్ పే షాక్స్.. నవ్వులు పూయిస్తున్న ట్రాన్సాక్షన్
X

దిశ, ఫీచర్స్ : తరాలు మారుతున్నా కొద్ది భాషలో కూడా చాలా చేంజెస్ వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పటి తరానికి కంప్యూటర్, ఇంటర్నెట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో వీళ్లు కమ్యూనికేషన్‌కి ఎక్కువగా కీ వర్డ్స్ ఉపయోగిస్తున్నారు. ఈ Zen-Z లాంగ్వేజ్ సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది. ఉదాహరణకు Good Morningకి GM అని, Why అనే పదానికి Y అని, Nuvvu అనడానికి సింపుల్‌గా NV అని ఇలా ప్రతి విషయాల్లో ఈ లాంగ్వేజ్ సింప్లిఫైడ్ చేసింది. అలాగే డబ్బులకు కూడా (1000 కి 1K)కొన్ని షాట్ కట్ వర్డ్స్ ఉంటున్నాయి. ఇలా Zen-Z లాంగ్వేజ్‌కు అలవాటుపడిన ఓ మేడం చేసిన పనికి ఓ వ్యక్తితో పాటు ఫోన్ పే కూడా షాక్ అయింది. ఓ ఆఫీసులో ఒక వ్యక్తి వచ్చి.. ‘మేడం మీకు లిక్విడ్ 4K ఇస్తాను. మీరు నాకు ఆన్ లైన్‌లో పంపిస్తారా ? అని అడుగుతాడు. ఆమె సరే అని.. అతను వద్ద ఉన్న 4000 క్యాష్ తీసుకుని అతడికి ఫోన్ పే లో ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఆమె చూపించిన ఫోన్ స్క్రీన్ షాట్ చూసి అతను షాక్ అవుతాడు. అదేంటి మనీ పంపిస్తే షాక్ అవ్వడం ఏంటీ అనుకుంటున్నారా ? ఆమె ఫోన్ పే నుంచి 4000 అని కొట్టడం మానేసి Zen-Z లాంగ్వేజ్‌లో 4K అని కొట్టి సెండ్ చేసింది. దీంతో ఆ వ్యక్తితో పాటు ఫోన్ పే కూడా షాక్ అయినట్టు అయింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ కావడంతో.. నవ్వుకుంటున్నారు నెటిజన్లు.

Next Story