- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kids and Parenting : పిల్లల్ని ప్రేమించండి.. కానీ అతి గారాభంతో ఇలా మాత్రం చేయకండి..!
Kids and Parenting : పిల్లల్ని ప్రేమించండి.. కానీ అతి గారాభంతో ఇలా మాత్రం చేయకండి..!

దిశ, ఫీచర్స్ : పిల్లలపై తల్లిదండ్రులకుండే ప్రేమ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక విధంగా చెప్పాలంటే పిల్లలే ప్రపంచంగా, ప్రాణంగా బతుకుతుంటారు. అయితే పిల్లలపట్ల ప్రేమ, అతి గారాభం కొన్నిసార్లు పిల్లల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కాబట్టి పిల్లలతో ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో, ఏ విషయాల్లో చొరవ ఇవ్వాలో, వేటిలో ఇవ్వకూడదో కూడా తెలిసి మసలుకోవాలి అంటున్నారు నిపుణులు. అలాంటప్పుడే పేరెంట్స్‌గా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన వారవుతారు. అదెలాగో చూద్దాం పదండి!
చిన్న పిల్లల మనసు తెల్లకాగితం లాంటిది అంటారు. అందులో పేరెంట్స్ ఏ గీతలు గీస్తారో, ఏ రాతలు రాస్తారో అవే వారిని ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అందుకే మీ పిల్లలకు ఎలాంటి జీవితం కావాలనుకుంటున్నారో ఆలోచించి, వారిని అలా మోటివేట్ చేయొచ్చు. అవసరమైనప్పుడు ఎమోషనల్ సపోర్ట్, మానసిక మద్దతు ఇస్తూనే.. మంచివి కాని విషయాల్లో అడ్డుచెప్పాలి. సరిహద్దులు నిర్ణయించాలి. క్రమశిక్షణగా ఉండటం నేర్పించాలి.
అన్నింటికీ ఒకే చెప్పకండి
పిల్లల మీద ప్రేమతో వారేం అడిగినా సమకూరుస్తుంటారు పేరెంట్స్. నచ్చింది కొనియ్యాలని పట్టుబట్టినప్పుడు, వారి అల్లరి చేష్టలను భరించనప్పుడు ఎక్కువగా ఇలా చేస్తుంటారు. అప్పుడప్పుడు అయితే పర్లేదు. కానీ ఇదే అలవాటుగా మారితే పిల్లలు మొండిగా తయారవుతారు. ఇది బిహేవియరల్ ఇష్యూస్‌కి దారితీయవచ్చు. కాబట్టి పిల్లలపై ప్రేమ, గారాబం చూపుతూనే వారిని కంట్రోల్లో పెట్టడం కూడా మంచిదంటున్నారు నిపుణులు.
ప్రతీ విషయంలో సపోర్ట్ చేస్తున్నారా?
పిల్లలు మంచి చేస్తే పొగడాలి. తప్పుచేస్తే హెచ్చరించాలి. కానీ పాపం పిల్లలు కదా అని తప్పుచేసిన ప్రతీసారి సమర్థిస్తూనో, పొగుడుతూనో ఉంటే మొదటికే మోసం రావచ్చు. పిల్లలు పెద్దయ్యాక కూడా తాము చేసేదంతా కరక్టేననే భావనకు ఇది దారితీయవచ్చు. కాబట్టి మంచి పనులు చేసినప్పుడు ప్రోత్సహించడం, పొరపాట్లు, తప్పులు చేసినప్పుడు హెచ్చరించడం చేయాలి. క్రమశిక్షణగా ఎలా మసలు కోవాలో వీలైనప్పుడల్లా పేరెంట్స్ చెప్తుండాలి.
చాడీలు, ఫిర్యాదులను గుడ్డిగా నమ్మొద్దు
పిల్లలే అనుకుంటాం. కానీ కొన్ని విషయాల్లో వారు మహా పిడుగులు కూడా. అసలు విషయం తెలిస్తే పేరెంట్స్ మందలిస్తారనో, కొడతారనో నిజాలు దాచేస్తుంటారు. పైగా తాము చేసిన తప్పును ఇతర పిల్లలపైకి, కుటుంబ సభ్యులపైకి తోసేస్తుంటారు. చాక్లెట్లు, బిస్కెట్లు, స్వీట్లు, పప్పులు ఇలా ఏవైనా తినేసి, నేను తినలేదనో, వాళ్లు తినారనో చెబుతుంటారు. ఇది సరదాగానే అనిపిస్తుంది. ఓ మూడేండ్ల లోపు వరకైతే పర్లేదు. కానీ ఎల్లప్పుడూ అదే అలవాటును కొనసాగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు. లేని విషయాలకు చాడీలు చెప్పడం, ఫిర్యాదులు చేయడం వంటివి గమనిస్తే అలా చేయకూడదని హెచ్చరించాలి.
గాడ్జెట్స్ చేతికివ్వకండి
ఈరోజుల్లో చాలామంది పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు మాన్పించడానికి, అన్నం తినకపోతే తినిపించడానికి ఫోన్లు చేతికిస్తుంటారు. కొంతసేపైతే పర్లేదు. కానీ ఐదారేండ్ల పిల్లల చేతికి ఫోన్ లేదా టీవీ రిమోట్ ఇస్తే వారు చాలా సేపటి వరకు వాటిలో నిమగ్నమైపోతుంటారు. ఇది వారి మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్‌పై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఫోన్లు, ట్యాబ్‌లు, టీవీ రిమోట్స్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పిల్లల చేతికి ఇస్తూ పట్టించుకోకుండా ఉండకండి. ఇవ్వకపోవడం మంచిది. ఇస్తే గనుక ఫలానా టైమ్ వరకే అని లిమిట్స్ అయినా పెట్టండి అంటున్నారు నిపుణులు.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






