- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇయర్ ఫోన్స్‌లో ఫుల్లుగా వాల్యూమ్ పెట్టి ఎంజాయ్ చేస్తున్నారా? ఎంతో కాలం ఉండరులే..
సంగీతం మనసుకు ప్రశాంతతనిస్తుంది. కాదనలేని సత్యమే. కానీ ప్రస్తుతం చాలా మంది ఇయర్ ఫోన్స్‌లో ఫుల్లుగా వాల్యూమ్ పెట్టుకుని మ్యూజిక్ వింటుంటారు. దీనివల్ల చెవులు శాశ్వతంగా వినబడకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

దిశ, ఫీచర్స్ : సంగీతం మనసుకు ప్రశాంతతనిస్తుంది. కాదనలేని సత్యమే. కానీ ప్రస్తుతం చాలా మంది ఇయర్ ఫోన్స్‌లో ఫుల్లుగా వాల్యూమ్ పెట్టుకుని మ్యూజిక్ వింటుంటారు. దీనివల్ల చెవులు శాశ్వతంగా వినబడకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. తరుచుగా బిగ్గర శబ్దాలు వినడం దీర్ఘకాలిక పరిణామాలకు దారితీస్తుందని సూచిస్తున్నారు. లక్షణాలు వెంటనే కనిపించకపోవచ్చు. కానీ ప్రమాదం మాత్రం ఉందనే చెప్తున్నారు. హానికరమైన ఈ అలవాటును కొనసాగించడం మానుకోవాలని సూచిస్తున్నారు. కాగా ఎక్కువ వాల్యూమ్‌తో సంగీతం వినడం వల్ల కలిగే కొన్ని ప్రధాన ఆరోగ్య పరిణామాలు చూద్దాం.
చెవి కణాలు డ్యామేజ్
బిగ్గరగా సంగీతం వినడం, ఇందుకు ఎక్కువసేపు ఎక్స్‌పోజర్ కావడం ఇయర్ సెల్స్‌కు హాని కలిగించే ప్రమాదం ఎక్కువ. నష్టం వెంటనే స్పష్టంగా కనిపించకపోయినా.. పదేపదే అధిక వాల్యూమ్ ఎక్స్‌పోజర్ చెవి పనితీరు క్షీణతను పెంచుతుంది. ఫలితంగా శాశ్వత వినికిడి లోపం ఏర్పడుతుంది.
వినికిడి నష్టం
ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు.. ఎక్కువ వాల్యూమ్ ఉందని హెచ్చరిస్తూనే ఉంటుంది ఆ డివైజ్. ఎందుకంటే పూర్తి వాల్యూమ్‌లో సంగీతాన్ని క్రమం తప్పకుండా వినడం వల్ల వినికిడి నష్టం (NIHL) కలుగుతుంది. సంగీతం, కచేరీలు వంటి బిగ్గరగా ఉన్న శబ్దాలకు ఎక్కువసేపు గురికావడం వల్ల ఈ రకమైన వినికిడి నష్టం సంభవిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.1 బిలియన్ల యువకులు సేఫ్‌గా మ్యూజిక్ వినట్లేదు. ముఖ్యంగా పర్సనల్ ఆడియో డివైజెస్ ద్వారా వినికిడి లోపం బారిన పడే ప్రమాదం అధికం.
ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్ రిస్క్
ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్‌లు లేదా ఇయర్‌బడ్‌లను ఉపయోగించినప్పుడు వినికిడి నష్టం ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. పరిసర వాతావరణంలోకి ధ్వనిని చెదరగొట్టే సాంప్రదాయ స్పీకర్‌ల మాదిరిగా కాకుండా..ఇన్-ఇయర్ పరికరాలు నేరుగా చెవి కాలువలోకి ధ్వనిని అందిస్తాయి.హాని కలిగించే సామర్థ్యాన్ని పెంచుతాయి.
టిన్నిటస్
వినికిడి నష్టం మొదటి సంకేతాలలో ఒకటి టిన్నిటస్.ఇది చెవులలో నిరంతర రింగింగ్, హిస్సింగ్ శబ్దం. లోపలి చెవిలోని కణాలకు హాని కలిగించడం వల్ల టిన్నిటస్ సంభవిస్తుంది.అధిక వాల్యూమ్ సంగీతాన్ని కొద్దిసేపు విన్న తర్వాత కూడా ఇలా అనిపిస్తుంది.






