- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
False situations: కరెక్ట్ కాదని తెలిసినా చేస్తుంటాం..! ఆ పనులేంటో తెలుసా?
False situations : కరెక్ట్ కాదని తెలిసినా చేస్తుంటాం.. ఆ పనులేంటో తెలుసా?

దిశ, ఫీచర్స్ : అబద్దాలాడటం మంచిది కాదని తెలుసు.. కానీ ఆడకుండా ఉండలేకపోతాం.. వ్యాయామం చేయకపోతే నష్టమని తెలుసు.. కానీ చేయలేకపోతాం.. ఒకటా, రెండా.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతీ రోజు ఇలా ఎన్నో అనుకుంటాం. కానీ.. కొన్నే అమలు చేస్తుంటాం. అప్పుడప్పుడూ అవి కూడా చేయం. తెలియక పొరపాటు చేస్తే ఏదో జరిగిపోయిందనుకోవచ్చు. మరి తెలిసి చేస్తే..! పోనీ కావాలని చేస్తే..!! తర్వాత సంగతి ఏమో కానీ.. ముందైతే మనసుకు నచ్చింది చేసేసే రకమే మనలో అత్యధిక మంది ఉంటారు. ఇది కాదనలేని నిజం. మనిషి ప్రవర్తనలో ఉండే సహజ గుణం. అందుకే ఏ విషయంలోనూ, ఏ వ్యక్తినీ పూర్తిగా ‘ఫలానా టైప్’ అనుకోవడానికి లేదు. ప్రతీ ఒక్కరిలో ప్లస్, మైనస్‌లు ఉంటాయి. కాకపోతే.. అవి ఇతరులకు, సమాజానికి చేసే మంచీ చెడులపై డిపెండై వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేస్తాయి అంటున్నారు నిపుణులు. అలాంటి వాటిలో అబద్దం కూడా ఒకటి. మనం వాటిని ఏయే సందర్భాల్లో ఎందుకు ఆశ్రయిస్తామో ఇప్పుడు చూద్దాం.
అబద్దం.. వాస్తవం.. అసలు రూపం
అబద్దమాడటం మంచిది కాదని అందరూ చెప్తుంటారు. మనకూ తెలుసు. కానీ ఆడకుండా ఉంటామా? అసలు ఉండగలమా? నో. సాధ్యం కాదు. ఎంత నిజాయితీ పరులైనా ఏదో ఒక దగ్గర, ఏదో ఒక సందర్భంలో అబద్దం చెబుతుంటారు. తరచుగా అబద్దాలాడటాన్ని సమాజం, మన చుట్టు పక్కల వ్యక్తులు తప్పు పడతారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆడే అబద్దాలను ఆ సమాజమే, ఆ వ్యక్తులే సమర్థిస్తారు. ఎందుకంటే అబద్దాలు అందరూ ఆడతారు. కరెక్ట్ కాదని తెలిసినా ఎందుకు అబద్దాలు ఆడతారు? అంటే అదంతే.. మనిషి లక్షణం, మనుగడలో భాగం. సరదాకో, అవసరానికో, భయంతోనో, భక్తితోనో, మంచి కోసమో, స్వార్థం కోసమో ఏదో ఒక అవసరం కోసం అబద్దాలు చెప్తుంటాం. కేవలం చెప్పేవారే కాదు, వాటిని విని నమ్మేవారు, ప్రచారం చేసేవారు, అబద్దాలతో ఆకట్టుకునే వారు, నిజమని నిరూపించగలిగే వారు కూడా ఉంటారు. ఇలాంటి పాత్రలు మన చుట్టూ సమాజంలో చాలానే ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో మనమూ ఏదో ఒక పాత్ర పోషిస్తుంటాం. అయినప్పటికీ అబద్దం ఎల్లప్పుడూ బ్యాడ్ బిహేవియర్‌గా పరిగణించడుతుంది. బెడిసి కొడితే సమస్యలనూ క్రియేట్ చేస్తుంది. అందుకే అబద్దం ఆడటం అన్ని విషయాల్లో మంచిది కాదు.
స్వీయ సంరక్షణ కోసం కూడా..
తెలిసినా ఎందుకు అబద్దం చెబుతారు? అంటే.. ఎవరి కారణాలు వారికి ఉంటాయి. అత్యంత సాధారణ కారణం.. స్వీయ సంరక్షణ. వ్యక్తులు ఆయా పరిస్థితుల్లో తమను తాము సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది నిజమైన పర్యవసానంగా బహిర్గతం అవుతుంది. అట్లనే మంచి కోసం కూడా కొందరు అబద్దాలు ఆడతారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులో, ఆత్మీయులో, స్నేహితులో అబద్దం ఆడటం వెనుక మీ మేలు దాగి ఉండవచ్చు. మిమ్మల్ని నిరాశా, నిస్పృహ భావాల నుంచి బయట పడేసేందుకు అబద్దం చెప్పి ఉండవచ్చు. అంటే ఇక్కడ నిరాశ, ఆందోళన యొక్క అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ మోసాన్ని సమర్థిస్తుందన్నమాట. ఇంకొన్నిసార్లు కొందరు ఈగో లేదా ఓర్వలేని గుణం వల్ల కూడా మనం అబద్దాలు చెప్పేస్తుంటాం. కొందరు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి, ఇతరుల కంటే తాము మెరుగ్గా ఉన్నామని చెప్పుకోవడానికి కూడా అబద్దాలు చెప్పేస్తుంటారు.
భయాలు, ప్రతీకారాలు ..
ఏదో కళంకం జరగుతుందేమోననే భయంతోనోనూ కొందరు అబద్దం చెప్తుంటారు. కొందరు తమలోని న్యూనతా భావాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్దం చెప్పేందుకు వెనుకాడరు. మరి కొందరు ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతోనూ అలా చేయవచ్చు. గతంలో తమకు హాని చేసినట్లు భావించే వ్యక్తికి, తాము కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో కూడా కొందరు అబద్దం చెప్పేస్తుంటారు. ఎదుటి వ్యక్తిని తమ సొంతం చేసుకోవడానికి లేదా తమకు అనుకూలంగా వ్యవహరించడానికి కూడా అబద్దం చెప్తుంటారు. కొంతమంది తారు మారు లేదా దుర్వినియోగం చేసే ఉద్దేశంతో కూడా అబద్దాలు చెబుతారు. మరి కొందరు తమను తాము కవర్ చేసుకోవడానికి లేదా నిజ స్వరూపాన్ని కప్పి పుచ్చుకోవడానికి అబద్దాలు ఆడేస్తుంటారు.
వాయిదా, హాబీ, క్యూరియాసిటీ
నిజానికి ఆ సందర్భంలో చేయగలిగిన పనిని కూడా వాయిదా వేయడం మంచి విషయం కాదు. అయినా అలా అదే చేస్తుంటాం కొన్నిసార్లు. కొందరు ఉద్దేశ పూర్వకంగానోర సాధారణంగానో అబద్దం చెప్తుంటారు. ఇంకొందరు ఏదో ‘డ్రామాటిక్’ సిచువేషన్‌ను ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనూ అబద్దాలు ఆడుతుంటారు. తమ జీవితాల్లోనూ ‘డ్రామా’లను క్రియేట్ చేసేవారు, వాటిని ఇష్టపడేవారు కూడా కొందరుంటారు. తాము మాత్రమే ఎందుకు ఇబ్బంది పడటం? అని చుట్టు పక్కలవారిని, కుటుంబ సభ్యులను, బంధువులను, కొలీగ్స్‌ను, ఫ్రెండ్స్‌ను కూడా ఒక్క అబద్దంతో ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నించేవారు కూడా అబద్దాలను ఆశ్రయిస్తుంటారు. ఇతరుల దృష్టిలో పడేందుకు కూడా కొందరు అబద్దాలను ఆశ్రయిస్తుండగా, ఇంకొందరు ఉత్సాహం కొద్దో, ఉత్సుకతతోనో అబద్దాలు ఆడటాన్ని హాబీగా కలిగి ఉంటారు.
పరిస్థితుల ప్రభావాన్ని బట్టి
ఒక సమస్య నుంచి బయటపడేందుకు లేదా అటువంటి పరిస్థితులను, ఇబ్బందికర పరిణామాలను నివారించడానికి కూడా అబద్దం చెబుతుంటారు కొందరు. ముఖ్యంగా ఈ లక్షణం పిల్లల్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. నిజం చెప్తే కోప్పడతారనో, కొడతారనో ఆ సందర్భంలో తప్పించుకోవడానికి ఇలా చేస్తుంటారు. పెద్దల విషయానికి వస్తే మంచీ చెడూ ఉద్దేశాలు ఉండవచ్చు. కొందరు ఇతరులకు హాని లేదా మోసం చేసే ఉద్దేశంతో అబద్దాలు చెప్పొచ్చు. పలువురు కోపం, భావోద్వేగం, ఆవేశం, ప్రేమ వంటి పరిస్థితులను కంట్రోల్ చేయడానికి కూడా చెప్పవచ్చు. పరీక్షల ప్రిపేరేషన్‌లో ఒత్తిడి ఎక్కువైనప్పుడు తలనొస్తుందని, ఫ్రెండ్‌తో మాట్లాడే ఉద్దేశంతో ఏదో పని ఉందని, వ్యాయామం చేయడానికి పొద్దున్న లేవలేక ఒంట్లో బాగోలేదని ఇలా జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి కూడా చాలా మంది అబద్దాలు చెప్తారు. సింపతీ కోసం కొందరు. స్వార్థం కోసం కొందరు అబద్దాలను ఆశ్రయిస్తుంటారు. మొత్తానికి ఏదో ఒక అవసరం కోసం ప్రతి ఒక్కరూ అబద్దం చెబుతారనేది మాత్రం కాదనలేని వాస్తవం.
Read More...
ఆ ఊరి మగాళ్లతో శృంగారానికి పోటీపడుతున్న మహిళలు.. డబ్బులిచ్చి మరీ..!






