- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార పట్టి.. సేద్యం చేసి.. డ్రాపౌట్స్ తగ్గించేందుకు అధ్యాపకుల వినూత్న ఆలోచన
పార పట్టి.. సేద్యం చేసి.. డ్రాపౌట్స్ తగ్గించేందుకు అధ్యాపకుల వినూత్న ఆలోచన

దిశ, భైంసా : ఎక్కడైనా అధ్యాపకులు పాఠాలు మాత్రమే చెబుతారు. ఆ కళాశాల లెక్చరర్లు మాత్రం పార పట్టి సేద్యం చేస్తున్నారు. అలా చేయడమేంటని ఎవరికైనా డౌట్ రావచ్చు. అసలు విషయం తెలిస్తే మాత్రం ప్రశంసించకుండా ఉండలేరు. ఎందుకంటే భైంసా పట్టణంలోని గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు చేస్తున్నది తమ స్వార్థం కోసం కాదు, విద్యార్థుల భవిష్యత్తుకోసం.
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు సాగుబాట పట్టారు. కాలేజీకి వచ్చి విద్యార్థులకు పాఠాలు బోధించడంతోపాటు కళాశాల ప్రాంగణంలో వ్యవసాయం కూడా చేస్తున్నారు. ఇదేదో పార్ట్ టైమ్ జాబ్ అనుకుంటే పొరపాటే. కాలేజీలో విద్యార్థుల డ్రాపౌట్‌ను తగ్గించేందుకు, మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. పట్టణానికి దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఉండే కాలేజీకి ఉదయం వచ్చే విద్యార్థులు మధ్యాహ్నం లంచ్ అవర్‌కి ఇంటికి లేదా హాస్టల్స్‌కి వెళ్లి భోజనాలు చేసి రావడానికి ఎక్కువ సమయం పడుతుండడంతో ఈ ఆలోచన చేశారు. ఇందుకోసం దాతల నుంచి బియ్యాన్ని సేకరించారు. కిరాణా, వంట సామగ్రి, భోజన ఖర్చులను అధ్యాపకులే తలా కొంత భరిస్తూ మధ్యాహ్న భోజనం విజయవంతంగా అమలు చేస్తున్నారు.
సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తూ..
మధ్యాహ్న భోజనానికి కాలేజీ ఆవరణలో ఉన్న దాదాపు అర ఎకరం స్థలంలో వివిధ కూరగాయలను పండిస్తున్న లెక్చరర్లు సేంద్రీయ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. స్వయంగా అధ్యాపకులే స్థలాన్ని చదును చేసి టమాటా, బెండకాయ, వంకాయ, మిరప, కాలీ ఫ్లవర్, క్యాబేజీ, చిక్కుడు, బీన్స్ వంటి పంటలను సాగుచేస్తున్నారు. ఇక్కడ అధ్యాపకులు సైతం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. దీంతో మధ్యాహ్నం డ్రాపౌట్స్ భారీగా తగ్గాయని కళాశాల ప్రిన్సిపల్ కే.బుచ్చయ్య తెలిపారు. ఐడియా అదిరింది కదూ!






