మ్యూజిక్ మిరాకిల్ .. పిల్లల్లో తెలివితేటలను పెంచుతున్న సంగీతం!

by Javid Pasha |   (  Updated:2025-06-19 06:12:43  IST  )

మ్యూజిక్ మిరాకిల్ .. పిల్లల్లో తెలివితేటలను పెంచుతున్న సంగీతం!

మ్యూజిక్  మిరాకిల్ .. పిల్లల్లో తెలివితేటలను పెంచుతున్న సంగీతం!
X

దిశ, ఫీచర్స్ : సంగీతం వినడం మనుసుకు హాయినివ్వడమే కాదు, మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఇది పిల్లలపై మరింత సానుకూల ప్రభావ చూపుతుందని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుల తాజా అధ్యయనం పేర్కొన్నది. పైగా ఇది మెదడుపై చూపే ప్రభావం కోడింగ్ (Programming) చేయడం కంటే కూడా ఎఫెక్టివ్‌గా ఉంటుందని తెలిపింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

అధ్యయనంలో భాగంగా పరిశోధకులు పిల్లల మెదడును ఉత్తేజ పరిచే పలు అంశాలను, కార్యకలాపాలను పరిశీలించారు. అందుకోసం పజిల్స్, కోడింగ్, మ్యూజిక్ వంటివి ఏ విధమైన ప్రభావాన్ని చూపుతున్నాయో విశ్లేషించారు. అయితే కోడింగ్ జస్ట్ జనరల్ పర్పస్ నెట్‌వర్క్‌ను మాత్రమే ఉత్తేజ పరుస్తుందని, పైగా ఇది లాజిక్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌కు సంబంధించిందని రీసెర్చర్స్ పేర్కొన్న పరిశోధకులు, సంగీతం మాత్రం దీనికికంటే ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని గుర్తించారు.

మ్యూజిక్ వినడం లేదా నేర్చుకోవడం అనేది పిల్లల మెదడులోని మల్టిపుల్ ఏరియాలను అభివృద్ధి చేస్తుందని పరిశోధకులు అంటున్నారు. దీనివల్ల పిల్లల్లో ఆనందానికి, సానుకూల దృక్పథానికి, తద్వారా మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తుందని పేర్కొంటున్నారు. అంతేకాదు మెదడు సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో, జ్ఞాపక శక్తిని, భాషా నైపుణ్యాలను, విషయాలపై శ్రద్ధ(Attention)ను, ఏకాగ్రతను పెంచడంలోనూ సంగీతం అద్భుతం(Music Miracle) చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. తరచుగా సంగీతం వినడం లేదా నేర్చుకోవడం పిల్లల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ను కూడా మెరుగు పరుస్తుంది. మానసిక రుగ్మతలను తగ్గిస్తుంది. మెదడు సామర్థ్యాన్ని పెంచుతుంది.

Next Story