- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.3.5 లక్షలతో వ్యాపారంలోకి.. ఇప్పుడామె ఆదాయం రూ. 3 వందల కోట్లు.. ఓ సాధారణ మహిళ సక్సెస్ జర్నీ..
చేతిలో పెద్దగా పైకం లేదు. కేవలం రూ. 3.5 లక్షలు, ఒక ల్యాప్‌టాప్, మనసులో లక్ష్యం ఇంకేం లేవు. కానీ.. ఇప్పుడు మూడు వందల కోట్లకు అధిపతి ఆమె.

దిశ, ఫీచర్స్ : వ్యాపారం ప్రారంభించాలంటే గట్స్ ఉండాలి. దానికి ఎక్కువ పెట్టుబడి అవసరం అనుకుంటారు చాలా మంది. కానీ కొందరు తక్కువ పెట్టుబడితోనే అద్భుతాలు చేస్తారు. ఇందుకు నిధియాదవ్ జీవితమే నిదర్శనం. హర్యానా రాష్ట్రంలోని గుర్‌గావ్‌కు చెందిన ఈ యువతి డెలాయిట్‌లోని ఓ సంస్థలో ఐదంకెల జీతంతో ఉద్యోగం చేసేది. కానీ అది ఆమెకు సంతృప్తినివ్వలేదు. సొంతంగా తనే ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించి ఎదగాలని బలంగా నిర్ణయించుకుంది.
ఇండియాకు తిరిగి వచ్చి..
2014లో తన కలను నెరవేర్చుకోవాలని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న నిధి యాదవ్ భారతదేశానికి తిరిగి వచ్చింది. కానీ చేతిలో పెద్దగా పైకం లేదు. కేవలం రూ. 3.5 లక్షలు, ఒక ల్యాప్‌టాప్, మనసులో లక్ష్యం ఇంకేం లేవు. పైగా అప్పటికే ఆమె ఒక శిశువుకు తల్లి కూడా. అయితేనేం.. భారతీయ మహిళలకు స్టైలిష్ ఎథ్నిక్ వేర్‌ను సరసమైన ధరల్లో అందించడాలన్న లక్ష్యంతో ముందుకు సాగింది. గుర్ గావ్‌లో తన కుటుంబానికున్న డబుల్ బెడ్ రూమ్‌ఫ్లాట్‌లోనే మహిళల కోసం బట్టల వ్యాపారం ప్రారంభించింది. ఇటలీలో ఫ్యాషన్ కోర్సు చదవడం, ఎమిలియో పుచ్చితో పనిచేయడం వంటివి అనుభవాలు వ్యాపారంలో ఆమెకు కలిసొచ్చాయి.
స్థానిక వనరులపైనే ఫోకస్..
ముఖ్యంగా మహిళల ఆసక్తి, ఆలోచనల్లో వేగం, స్థానిక రిసోర్సింగ్‌పై ఎక్కువ ఫోకస్ చేసింది నిధి యాదవ్. ప్రతీ 15 రోజులకు ఒకసారి కొత్త డిజైన్లను విడుదల చేయడం, జైపూర్ నుంచి స్థానికంగా రిసోర్సింగ్ చేయడం ద్వారా ఖర్చులను తగ్గించుకుంది. సిబ్బంది లేరు కాబట్టి తన బెడ్ రూమ్ నుంచే ఆర్డర్లను ప్యాక్ చేయడం ద్వారా ప్రారంభ దశ వ్యాపారంలో కుటుంబ సహకారంతో చాలా కష్టపడింది. ఈ వ్యూహాల ఫలితమేనేమో ఆమె 4వ సంవత్సరం నాటికి తన వ్యాపారంలో ఆశించదగిన ఫలితాన్ని సాధించింది. అంటే.. 2018 నాటికి ఆమె బ్రాండ్ రూ. 48 కోట్ల ఆదాయాన్ని రాబట్టింది. 2021 నాటికి ఇన్వెస్టర్ల నుంచి ఎటువంటి ఫీడింగ్ లేకుండానే ఆమె ఆ ఇన్‌కం రూ.200 కోట్లను దాటింది. ప్రస్తుతం ఆ టర్నోవర్ 250 కోట్ల నుంచి 300 కోట్ల మధ్య ఇటూ ఇటూ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌తో పాటు అక్స్ మైంట్రా, ఫ్లిప్‌కార్ట్ వంటి వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్ బిజినెస్ కూడా కొనసాగుతోంది. రూ. 500 కోట్ల టర్నోవర్‌తోపాటు గ్లోబల్ విస్తరణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు నిధియాదవ్ పేర్కొంటున్నారు.






