- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ల్యాండ్ అగ్రిమెంట్ తర్వాత రిజిస్ట్రేషన్ చేయకపోతే.. ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు?
మీరు ఓ ప్లాట్ చూశారు.. నచ్చింది.. అడ్వాన్స్ ఇచ్చేశారు.. అగ్రిమెంట్ రాసుకున్నారు.. కానీ సదరు యజమానికి మరో కస్టమర్ ఓ రెండు లక్షలు ఎక్కువ ఇస్తానని ఒప్పుకున్నాడు. దీంతో ఆ ప్రాపర్టీ అతనికే అమ్మాలని నిర్ణయించుకున్నాడు? మరి ముందు అడ్వాన్స్ ఇచ్చిన వ్యక్తి పరిస్థితి ఏంది?

దిశ, తెలంగాణ బ్యూరో: భూముల ధరలు పెరిగిన తర్వాత ఒప్పందాలను ఈజీగా తుంగలో తొక్కేస్తున్నారు. ఒకరు రూ.10 లక్షలకు మాట్లాడుకొని అడ్వాన్స్ ఇస్తారు. మరుసటి రోజే మరొకరు రూ.12 లక్షలు ఇస్తామంటారు. దాంతో యజమానికి ఆశ పుడుతుంది. మొదటి బేరానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నప్పటికీ తాను అమ్మనంటూ మొండికేస్తాడు. ఇలాంటివి రియల్ ఎస్టేట్ రంగంలో తరచూ జరుగుతున్నాయి. కానీ ఒకసారి ప్లాట్, ఇల్లు, వ్యవసాయ భూమి.. అమ్మేందుకు అగ్రిమెంట్ చేస్తే గడువులోగా డబ్బులు చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేయాల్సిందే.
అగ్రిమెంట్ చేసుకున్నారా?
ఎవరైనా ప్లాట్, ఇల్లు, పొలం కొనుగోలు చేసే ముందు మాట్లాడుకున్న అమౌంట్ పూర్తిగా ఇవ్వలేరు.. ఇవ్వరు. 45 రోజుల నుంచి మూడు నెలల వరకు గడువు పెట్టుకున్నారు. కొంత అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకుంటారు. బాండ్ పేపర్ మీదనే అన్నీ రాసుకుంటారు. ఇరుపక్షాలు, సాక్షులతో సహా సంతకాలు చేసుకుంటారు. తర్వాత ఆ యజమాని రిజిస్ట్రేషన్ చేయకుండా వెనక్కి తగ్గితే ఏం చేయాలన్న డౌట్ అందరికీ ఉంటుంది.
నిజానిజాలు ఏమిటంటే..
– అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది కొనుగోలు, అమ్మకానికి సంబంధించి చట్టబద్ధమైన డాక్యుమెంట్.
– అడ్వాన్స్ మొత్తం, రిజిస్ట్రేషన్ తేదీ, షరతులు వంటివి రాసుకుంటారు.
– యజమాని ఒప్పందం ప్రకారం ఆస్తిని అమ్మకపోతే.. కొనుగోలుదారుడు కోర్టులో స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ కోసం కేసు వేయొచ్చు. ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయమని కోర్టు నుంచి ఆర్డర్ పొందే అవకాశం ఉంది.
– లేకపోతే అడ్వాన్స్ డబ్బు తిరిగి ఇవ్వమని అడగొచ్చు. అవసరమైతే నష్టపరిహారం కూడా కోరవచ్చునని చట్టం చెబుతుంది.
– మాటల మీద వద్దు. ఎప్పుడైనా రాతపూర్వక అగ్రిమెంట్‌తోనే అడ్వాన్స్ ఇవ్వాలి. అది భవిష్యత్తులో రక్షణ ఇస్తుంది.
చేయాల్సిన పనులు
– అగ్రిమెంట్ కాపీ, అడ్వాన్స్ చెల్లించిన రశీదులను భద్రంగా ఉంచుకోవాలి.
– ముందుగా యజమానికి లిఖితపూర్వక నోటీసు పంపి రిజిస్ట్రేషన్ చేయమని అడగాలి. లేదంటే ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమని కోరాలి.
– స్పందించకపోతే కోర్టులో కేసు దాఖలు చేసి మీ హక్కును అమలు చేయించుకోవచ్చు.
– ఇందులో కాల వ్యవధి ప్రధానం. ఆలస్యం చేస్తే చట్టపరమైన ఇబ్బందులు వస్తాయి.






