- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్బులు ఊరికే రావు.. గుండు అంకుల్ మరో క్రేజీ వీడియో వైరల్
డబ్బులు ఊరికే రావు అంకుల్ గుర్తున్నారు కదా.. ఎలా మరిచిపోతాం లెండి. లలితా జ్యువెల్లర్స్ అధినేత కిరణ్.. తన బ్రాండ్ ప్రమోషన్‌లో కీలకపాత్ర వహిస్తారు. యాడ్స్‌లో ఆయనే నటిస్తారు.

దిశ, ఫీచర్స్ : డబ్బులు ఊరికే రావు అంకుల్ గుర్తున్నారు కదా.. ఎలా మరిచిపోతాం లెండి. లలితా జ్యువెల్లర్స్ అధినేత కిరణ్.. తన బ్రాండ్ ప్రమోషన్‌లో కీలకపాత్ర వహిస్తారు. యాడ్స్‌లో ఆయనే నటిస్తారు. దీని కారణంగా జనాలకు దగ్గరైపోయిన ఆయన.. గుండు అంకుల్‌గా కూడా ముద్దుగా పిలుచుకునేంత పక్కింటివారిగా మారిపోయారు. ఇంతకీ ఈ స్టోరీ అంత ఎందుకు చెప్తున్నామంటే.. ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆయన వీడియో చూస్తుంటే ఇన్‌స్పైరింగ్‌గా ఉందని చాలా మంది కామెంట్ చేయడమే ఇందుకు కారణం.
గుండు అంకుల్ ఓ మంత్రితో మాట్లాడుతున్న సమయంలో ఎండకు గుండుకు చెమట పట్టేస్తుంది. ఈ క్రమంలో ఆయన గుండు తుడుస్తూ ఉంటాడు ఓ పని మనిషి. దీంతో ‘‘మనం లైఫ్‌లో ఎంత సంపాదించాలంటే.. మన గుండు తుడిచేందుకు కూడా ఒకరిని పెట్టుకునేంత’’ అని ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీనిపై రియాక్ట్ అవుతున్న నెటిజన్లు.. ‘‘పొద్దు పొద్దున్నే గొప్ప మోటివేషన్ దొరికింది’’, ‘‘డబ్బులు ఊరికే రావు’’, ‘‘ ఆ ఉద్యోగం నాకు ఇప్పించండి’’, ‘‘ గుండు ఎవ్వరికీ ఊరికే రాదు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా గుండు అంకుల్ ఇంత సంపాదించేందుకు మహానటి సావిత్రిగారు కూడా ఒక కారణమని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆమె ఇచ్చిన సలహాలు లైఫ్‌లో తనకు బాగా హెల్ప్ అయ్యాయని తెలిపాడు. మొత్తానికి మంచి వ్యాపారిగా రాణిస్తున్న ఆయన.. ఈ తరానికి నిజంగా స్ఫూర్తిదాయకమే.
లైఫ్ లో ఎంత సంపాదించాలి
— Nani (@Ravanaroy) February 10, 2025
ఇంత... గుండు తుడవడానికి కూడా ఒకడిని పెట్టుకునేంత... pic.twitter.com/YjhKV4oTZg






