Viral Video: డబ్బులు ఊరికే రావు అని చెప్పే గుండు బాస్ వేదాంతం వింటే కన్నీళ్లు ఆగవు..

by Vennela |   (  Updated:2025-04-25 04:51:45  IST  )

Viral Video: లలిత జ్యువెలరీ నగల దుకాణం ద్వారా దేశవ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి లలిత జ్యువెలరీ అధినేత ఎం. కిరణ్ కుమార్ తాజాగా ఓ వైరల్ వీడియో ద్వారా ఆయన వార్తల్లోకి ఎక్కారు.

Viral Video: డబ్బులు ఊరికే రావు అని చెప్పే గుండు బాస్ వేదాంతం వింటే కన్నీళ్లు ఆగవు..
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: లలిత జ్యువెలరీ నగల దుకాణం ద్వారా దేశవ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి లలిత జ్యువెలరీ అధినేత ఎం. కిరణ్ కుమార్ తాజాగా ఓ వైరల్ వీడియో ద్వారా ఆయన వార్తల్లోకి ఎక్కారు. మన జీవితంలో మనకి ఉచితంగా వచ్చేది కేవలం శాపాలు మాత్రమే అంటూ వేదాంతం చెప్పారు.ఓ యూట్యూబ్ ఛానల్ లో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎవరు ఊరికే ఏది ఇవ్వరని, రోడ్డు మీద వెళ్లే బిక్షగాడికి కూడా అర్ధరూపాయి పుణ్యం వస్తుంది అంటేనే ఇస్తారని, కొన్ని పచ్చి నిజాలను ఆయన బయటపెట్టారు.

తన జీవితంలో ఎదురైన సంఘటనలను ఆయన గుర్తుచేసుకొని ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. అయితే డబ్బులు తీసుకున్న వాళ్లు కేవలం డబ్బుల కోసం మాత్రమే ఆశీర్వదిస్తారని, అదే డబ్బులు ఇవ్వకపోతే శాపాలు పెడతారని కఠోర సత్యాలను ఆయన బయటపెట్టారు. ప్రస్తుతం కిరణ్ కుమార్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లలిత జ్యువెలరీ ద్వారా అడ్వర్టైజ్మెంట్ ప్రపంచంలో ఆయన ఒక విప్లవాన్నే సృష్టించారని చెప్పవచ్చు. ఎందుకంటే అంతకుముందు నగల దుకాణం అనగానే హీరోయిన్లు, ఇతర సెలబ్రిటీలు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్లుగా కనిపించేవారు.

కానీ కిరణ్ కుమార్ వినూత్నంగా తాను చైర్మన్ పొజిషన్లో ఉన్నప్పటికీ తనకు తానే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారి డబ్బులు ఊరికే రావు.. అంటూ ఒక వినూత్నమైన అడ్వర్టైజ్మెంట్లతో తెగ పాపులర్ అయిపోయారు. తన బ్రాండ్ కు తానే బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన గర్వంగా చెప్పుకుంటారు. 15వ ఏట వ్యాపారాన్ని ప్రారంభించిన కిరణ్ కుమార్ అంచలంచలుగా ఎదుగుతూ ఈరోజు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జ్యువెలరీ చెయిన్ ఉన్న వ్యాపారవేత్తగా ఎదిగారు. కిరణ్ కుమార్ జువెలరీ విభాగంలో భిన్నంగా వ్యాపారం చేశారు. అందుకే ఆయన సక్సెస్ అందుకొని ఈరోజు నలుగురికి సక్సెస్ పాఠాలు చెబుతున్నారు. అందులో భాగమే ఈ ఇంటర్వ్యూ అని సోషల్ మీడియాలో ఆయన అభిమానులు షేర్ చేస్తున్నారు.



Next Story