- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: గుండుబాస్ తెలివితేటలు మామూలుగా లేవు.. బంగారం పేరు వింటే పాడ మీద పడుకున్న శవం లేస్తుంది అంటున్నాడు.. వైరల్ వీడియో
Viral Video: డబ్బులు ఊరికే రావు అనేది లలిత జ్యువెలర్స్ ట్యాగ్ లైన్

దిశ, వెబ్ డెస్క్: Viral Video: డబ్బులు ఊరికే రావు అనేది లలిత జ్యువెలర్స్ ట్యాగ్ లైన్..ఎలాంటి హీరోయిన్లు మోడల్స్ లేకుండానే.. తనకు తానే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఈరోజు లలిత జ్యువెలరీ అంటేనే గుర్తొచ్చే బ్రాండ్ అంబాసిడర్ గా కిరణ్ కుమార్ యావత్ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. సంస్థకు తానే చైర్మన్ అయినప్పటికీ, తన వ్యాపార ప్రచారం తనకన్నా బాగా ఎవరూ చేయలేరని భావించి ఆయనే చివరకు బ్రాండ్ అంబాసిడర్ గా దిగి ఈరోజు, లలిత జ్యువెలరీ కి అసలు సిసలైన బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన ఎదిగారు.
జీవితంలో ఎన్నో కష్టాలన్నీ ఎదుర్కొని ఒక చిన్న స్థాయి నుంచి ఈరోజు వేలకోట్ల సామ్రాజ్యానికి ఎదిగిన కిరణ్ కుమార్ జీవితం నలుగురికి ఆదర్శప్రాయం అని చెప్పవచ్చు. బంగారం మార్కెట్లో ఎంత పోటీ ఉన్నప్పటికీ కిరణ్ తన దైన శైలిలో వ్యాపారంలో దూసుకెళ్తూ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక కేరళలో కూడా బ్రాంచీలు ఏర్పాటు చేసి వ్యాపారంలో దూసుకెళ్తున్నాడు.
లలిత జ్యువెలర్స్ అంటేనే ఈరోజు కిరణ్ కుమార్, బంగారం కొనుగోలు చేసే వారికి లలిత జ్యువెలరీ గుర్తొచ్చే పేరుగా మారిపోయిందంటే బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసిన కిరణ్ కుమార్ ఎంతో ప్రభావం చూపించారని చెప్పవచ్చు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెబుతూ తనకు వ్యాపారం పట్ల బంగారం పట్ల ఎంత ప్యాషన్ ఉందో పేర్కొన్నారు.
తనకు బంగారం అంటే ఎంత ఇష్టమో చెబుతూ తాను పాడ మీద తీసుకెళుతున్నప్పటికీ ఒక కేజీ బంగారం అమ్మి పెట్టమంటే వెంటనే లేచి వస్తానని చమత్కారంగా చెప్పాడు. ఇటీవలకు యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు అందులో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.






