‘ఖాకీ’లోని మానవత్వం బయటపడితే ఇలానే ఉంటుంది.. లేడీ కానిస్టేబుల్‌పై ప్రశంసల జల్లు

by Bhoopathi Nagaiah |

మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఓ మహిళ.. తన చిన్నారి ఏడుస్తుండటంతో అసౌక్యారానికి గురైంది. గమనించిన లేడీ కానిస్టేబుల్ చిన్నారి ఆడిస్తూ ఆ తల్లికి సాయం చేసింది.

‘ఖాకీ’లోని మానవత్వం బయటపడితే ఇలానే ఉంటుంది.. లేడీ కానిస్టేబుల్‌పై ప్రశంసల జల్లు
X

దిశ, పెబ్బేరు: పోలీస్ విధుల్లో కఠినత్వం కాదు మానవత్వం కూడి ఉంది మహిళా కానిస్టేబుల్ శివాని చాటి చూపింది. వివరాల్లోకెళితే ప్రజాస్వామ్య పండుగలో ఓ చిన్న మానవత్వ క్షణం అందరి హృదయాలను తాకింది. పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో ఐదవ వార్డ్ కౌన్సిలర్‌గా ఎన్నికైన భాగ్యలక్ష్మి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన వేళ, అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ శివాని చూపిన సేవా భావం అందరినీ ఆకట్టుకుంది. ప్రమాణస్వీకారానికి వచ్చిన ఒక చిన్నారి తన తల్లితో కలిసి కార్యక్రమానికి హాజరైంది. సభలో జనసమ్మర్థం, కోలాహలం మధ్య చిన్నారి అసౌకర్యంగా ఉండటాన్ని గమనించిన కానిస్టేబుల్ శివాని, విధుల్లో ఉన్నప్పటికీ మానవత్వాన్ని ముందుకు తెచ్చారు. ఆ చిన్నారిని ఆప్యాయంగా ఆలింగనం చేసి, కొద్దిసేపు ఆదరిస్తూ తల్లికి సహాయం చేశారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని కదిలించింది. పోలీసు విధుల్లో కఠినత్వం మాత్రమే కాకుండా, మానవత్వం కూడా ఉంటుందనే విషయాన్ని శివాని తన చర్యతో చాటిచెప్పారు. ప్రజల భద్రతే కాకుండా, వారి భావోద్వేగాలకు కూడా అండగా నిలబడగలమని నిరూపించారు. సోషల్ మీడియాలో ఈ సంఘటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. “ఖాకీకి మానవత్వం కలిసొస్తే ఇలానే ఉంటుంది” అంటూ పలువురు అభినందిస్తున్నారు.

Next Story