క్యాన్సర్ కణాలను చంపే నానోబాట్స్‌.. సైంటిస్టుల మరో సాంకేతిక ఆవిష్కరణ!

by Javid Pasha |   (  Updated:2025-11-15 07:37:04  IST  )

శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన నానోబాట్స్‌ను బాక్టీరియోబాట్స్ అని కూడా పిలుస్తారు. ఒక విధంగా ఇవి అతిచిన్న రోబోట్స్‌గా పేర్కొనవచ్చు.

క్యాన్సర్ కణాలను చంపే నానోబాట్స్‌..  సైంటిస్టుల మరో సాంకేతిక ఆవిష్కరణ!
X

దిశ, ఫీచర్స్ : క్యాన్సర్ నివారణ చికిత్సల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. తొలిదశలోనే గుర్తించడంలో ఏఐ ఆధారిత టూల్స్ పనిచేస్తున్నాయి. కాగా కొరియన్ శాస్త్రవేత్తలు మరో సరికొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చారు. క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక పురోగతికి బాట వేశారు. ఏంటంటే.. క్యాన్సర్ కణాలను, కణితులను గుర్తించడమే కాకుండా వాటిని లోపలి నుంచి పూర్తిగా నాశనం చేయగల నానోబాట్స్‌ను చొన్నామ్ నేషనల్ యూనివర్సిటీ (Chonnam National University)కి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన నానోబాట్స్‌ను బాక్టీరియోబాట్(Bacteriobot) అని కూడా పిలుస్తున్నారు. ఒక విధంగా ఇవి అతిచిన్న రోబోట్స్‌ అని చెప్పవచ్చు. చికిత్సల సందర్భంగా క్యాన్సర్ రోగుల్లో వీటిని ప్రవేశ పెట్టడం ద్వారా అవి కణాల లోపలికి వెళ్లి వాటిని పూర్తిగా నాశనం చేస్తాయి. ముఖ్యంగా కీమోథెరపీ వంటి అధునాతన శస్త్రచికిత్సల్లో నొప్పి, గాయాలు వంటివి లేకుండా సమర్థవంతంగా పూర్తి చేయడంలో సహాయపడతాయి. మరొక విషయం ఏమిటంటే.. ఈ నానోబాట్స్ నానో పార్టికల్స్ అండ్ బయో రెస్పాన్సివ్ సెన్సార్లతో కూడి ఉంటాయి.

నానోబాట్స్‌లోని సూక్ష్మ సాంకేతికత, ఏఐ ఆధారిత ఆల్గారిథమ్స్ కారణంగా అవి శరీరంలోకి ప్రవేశించాక, రోగుల క్యాన్సర్ కణాలను మాత్రమే నానశనం చేస్తాయి. మిగతా ఆరోగ్య కరమైన కణాలకు ఎటువంటి హాని కలిగించవు. ఇటీవలి ల్యాబ్ టెస్టుల్లో జంతువులపై ప్రయోగాలు నిర్వహించగా, ఈ అతిచిన్న నానోబాట్స్ క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే క్యాన్సర్ శస్త్ర చికిత్సల్లో మరో సరికొత్త సాంకేతిక శకం మొదలైనట్టేనని నిపుణులు చెబుతున్నారు. Link

Next Story