- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిల్లల్లో పెరుగుతున్న కిడ్నీలో రాళ్ల కేసులు.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త..
మూత్రపిండాలు రక్తాన్ని శుభ్రపరచడం, వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపే బాధ్యతను కలిగి ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఈ వ్యర్థ రసాయనాలు గట్టి స్ఫటికాలుగా మారుతాయి. వీటినే కిడ్నీ స్టోన్స్ అంటారు.

దిశ, ఫీచర్స్ : మూత్రపిండాలు రక్తాన్ని శుభ్రపరచడం, వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపే బాధ్యతను కలిగి ఉంటాయి. అయితే కొన్నిసార్లు మూత్రంలోని వ్యర్థ రసాయనాలు గట్టి స్ఫటికాలుగా మారుతాయి. వీటినే కిడ్నీ స్టోన్స్ అంటారు. ఇవి మూత్ర వ్యవస్థలో అడ్డంకిని కలిగిస్తాయి. తీవ్రమైన నొప్పి, యూరిన్‌లో రక్తం, చలి, వణుకు,జ్వరం, చెమటలు పట్టడం లాంటి పరిస్థితి తలెత్తుతుంది. అయితే ఇది ప్రస్తుతం పెద్దల సమస్య మాత్రమే కాదు. ఆహారం, జీవనశైలి మార్పుల కారణంగా టీనేజర్లు, పిల్లల్లోనూ వస్తున్నాయి. పీడియాట్రిక్ కిడ్నీ రాళ్ల వ్యాధి (KSD) పెరుగుతోంది. దాదాపు యాభై శాతం కేసులు పెరగ్గా.. ఇందుకు గల కారణాలు ఏంటి? నివారణ వ్యూహాలు ఏమున్నాయి? తెలుసుకుందాం.
ముఖ్య ప్రమాద కారకాలు:
ఆహారం: ప్రాసెస్ చేసిన ఫుడ్స్, సోడియం, ఫ్రక్టోజ్, జంతు ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవడం
జీవనశైలి: ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, నిర్జలీకరణం
వైద్య కారకాలు: మూత్రాశయ ఇన్ఫెక్ఫన్లు, జీవక్రియ రుగ్మతలు, కొన్ని మందులు (మూర్ఛలు, మైగ్రేన్లు), పెరిగిన యాంటీబయాటిక్ వాడకం
ఎందుకు ఆందోళనకరం?
* రెండు దశాబ్దాలలో కేసులు 40% పెరిగాయి
* తీవ్రమైన నొప్పి, UTI, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు
నివారణ వ్యూహాలు:
* ప్రతిరోజూ 8-10 గ్లాసుల నీరు త్రాగాలి.
* సోడియం, ప్రాసెస్ చేసిన ఫుడ్ తీసుకోవడం తగ్గించాలి.
* సిట్రస్ పండ్లు తీసుకోవడం పెంచాలి (నారింజ, నిమ్మకాయలు).
* కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి.
* జంతు ప్రోటీన్, కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకోవడం పరిమితం చేయాలి.
* ఎముకలు, మూత్రపిండాల ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు త్రాగాలి. 🥛






