- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లడఖ్ హీరో.. మంచు చిరుతల రక్షకుడు.!
మంచు చిరుతలను కాపాడినందుకు అంతర్జాతీయ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు

దిశ, ఫీచర్స్: లడఖ్‌లోని హెమిస్ నేషనల్ పార్క్‌లో వన్యప్రాణి సంరక్షకుడిగా పనిచేస్తున్న ఖెన్‌రాబ్ ఫుంట్సోగ్.. ఒక దుప్పటి, వలను ఉపయోగించి గత రెండు దశాబ్దాలుగా 47 మంచు చిరుతలను రక్షించాడు. భారతదేశంలో అత్యంత దుర్లభమైన పెద్ద పిల్లులలో ఒకటైన మంచు చిరుతలను కాపాడినందుకు అంతర్జాతీయ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు.
12 సంవత్సరాల వయసులో..
లేహ్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిల్లింగ్ అనే చిన్న గ్రామం వాళ్లది. చిన్నప్పుడు గొర్రెలు, మేకలను కొండలపై మేపడానికి తీసుకెళ్లేటప్పుడు స్నో లెపర్డ్‌లను దూరం నుండి చూసేవాడు. ఈ గ్రామం హెమిస్ నేషనల్ పార్క్‌లో ఉండటం వల్ల ఎత్తయిన ప్రాంతాలకు వెళితే స్నో లెపర్డ్‌లను చూడడం అంత కష్టం కాదు. అప్పుడు తన వయసు 12 సంవత్సరాలు. వాళ్ల అమ్మమ్మ అంత్యక్రియల సన్నాహాల సమయంలో ఒక స్నో లెపర్డ్‌ను 100 మీటర్ల దూరం నుంచి చూశాడు. ఈ సంఘటన తనను వన్యప్రాణి సంరక్షణ విభాగంలో స్వచ్ఛంద సేవకుడిగా చేరేలా ప్రేరేపించింది.
47 పులులను..
2000లో 22 సంవత్సరాల వయసులో వన్యప్రాణి సంరక్షకుడిగా అధికారికంగా చేరాడు. అప్పటి నుండి ఇప్పటివరకు 47 స్నో లెపర్డ్‌లను రక్షించాడు. ప్రస్తుతం లడఖ్‌లోని చంగ్‌తాంగ్, హెమిస్ నేషనల్ పార్క్, కార్గిల్, నుబ్రా వ్యాలీలలో విస్తృత కెమెరా ట్రాపింగ్ పద్ధతులతో స్నో లెపర్డ్‌ల జనాభా గణనను పూర్తి చేస్తున్నారు. హెమిస్ నేషనల్ పార్క్‌లో ప్రస్తుతం దాదాపు 60 స్నో లెపర్డ్‌లు ఉన్నాయి. పార్క్‌లో సగం విస్తీర్ణంలో కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం లడఖ్‌లో స్నో లెపర్డ్‌ల సంఖ్య 250కి పైగా ఉంటుందని అంచనా వేసి వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మార్గదర్శకత్వంలో గణన చేస్తున్నారు.
పులుల సంరక్షణలో దిట్ట
ఖెన్‌రాబ్ స్నో లెపర్డ్‌లు సంచరించే రిడ్జ్‌లైన్‌లు, విరిగిన కొండలు, లోతైన లోయలు, ఎత్తయిన రాళ్లు వంటి ప్రాంతాలను గుర్తించి కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేస్తారు. రోలింగ్, చదునైన భూమి స్నో లెపర్డ్‌లకు అనుకూలమైన ప్రాంతం కాదు. అయినప్పటికీ ఈ గణనలో అన్ని ప్రాంతాలను కవర్ చేయడానికి కెమెరాలను ఏర్పాటు చేశారు. 20 సంవత్సరాల అనుభవంతో ఖెన్‌రాబ్ ఈ దుర్లభ జంతువులను ట్రాక్ చేయడంలో నైపుణ్యం సంపాదించాడు. అతను ముందుగా అడుగు గుర్తులు, గీతలు, మలం, సుగంధ స్ప్రేలు, గోళ్ల గుర్తులు, చంపిన జంతువుల అవశేషాలు వంటి పరోక్ష సంకేతాలను పరిశీలిస్తాడు.
అవార్డుల్లోనూ అదుర్స్
స్నో లెపర్డ్‌లను రక్షించడం అంత సులభమైన పని కాదు. మొదట్లో ఈ సాహసాలు ట్రాంక్విలైజర్‌లు లేకుండా జరిగాయి. 2000ల తర్వాత కామోఫ్లాగ్ నెట్‌లు, బ్లోపైప్‌లు, ట్రాంక్విలైజర్ గన్‌లు వంటి సామగ్రి అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ ట్రాంక్విలైజర్‌ల వినియోగంలో జాగ్రత్త అవసరం. అతిగా ఉపయోగిస్తే జంతువుకు హాని కలుగుతుంది. 2017లో స్నో లెపర్డ్ సంరక్షణలో రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్‌లాండ్ నుండి "సేవ్ ది స్పీసీస్ అవార్డు పొందాడు. 'టేల్స్ ఆఫ్ ది స్నో లెపర్డ్' అనే పుస్తకాన్ని రాశాడు. దీనికి 2017లో 'సాన్ మిగ్యూల్ రిచ్', 2020లో 'కిర్లోస్కర్ వసుంధర మిత్రే అవార్డు'లు వచ్చాయి.






