Lavender Plant : నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా..? ఈ ఒక్క మొక్కను మీ బెడ్ రూమ్‌లో ఉంచుకుంటే చాలు !

by Javid Pasha |   (  Updated:2025-06-01 09:58:44  IST  )

Lavender Plant : నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా..? ఈ ఒక్క మొక్కను మీ బెడ్ రూమ్‌లో ఉంచుకుంటే చాలు !

Lavender Plant : నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా..? ఈ ఒక్క మొక్కను మీ బెడ్ రూమ్‌లో ఉంచుకుంటే చాలు !
X

దిశ, ఫీచర్స్ : ఇటీవలి కాలంలో అనేక మందిని వేధిస్తున్న సమస్యల్లో నిద్రలేమి కూడా ఒకటి. ఒక విధంగా చెప్పాలంటే అన్ని అనారోగ్య సమస్యలకు ఇది మూలం అంటారు నిపుణులు. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే నాణ్యమైన నిద్ర అవసరమని చెబుతుంటారు. అయినప్పటికీ జీవనశైలిలో మార్పులు, నైట్ షిఫ్టులు వంటి పలు ఇతర కారణాలవల్ల కొందరు నిద్రలేమిని ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారికి పాటించదగిన కొన్ని పరిష్కారాలు కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాంటి వాటిలో లావెండర్ మొక్క కూడా ఒకటి. దీనిని బెడ్ రూములో పెట్టుకోవడంవల్ల నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టడంతో పాటు పలు బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం.

* లావెండర్ మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దాని సహజ నూనెలలో లినలూల్, లినలైల్ అసిటేట్ వంటి సమ్మేళనాలు కూడా ఉంటాయి. కాబట్టి దీనిని బెడ్ రూములో ఉంచడంవల్ల పలు రకాల కీటకాలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా నాడీ వ్యవస్థను శాంతిపరచడంలో, మెరుగైన నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. ఈగలు, దోమలను, పలు రకాల కీటకాలను దూరంగా ఉంచడంలో ఈ మొక్కలోని ఔషధ గుణాలు, వాసనలు సహజ నిరోధకాలుగా పనిచేస్తాయి.

*2011 నాటి ‘Journal of Medical Entomology’లో పబ్లిషైన అధ్యయనం ప్రకారం లావెండర్ ఎసెన్షఇయల్ ఆయిల్ దోమలను నిరోధించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇందులోని సుగంధం విషపూరిత కీటకాలను గందరగోళ పరచడంవల్ల అవి మొక్క ఉన్న పరిసరాల్లోకి రాకుండా ఉంటాయి. లావెండర్ మొక్క గదిలోని తేమను గ్రహిస్తుంది. ఎయిర్ క్వాలిటీని పెంచుతుంది.

*లావెండర్ మొక్కలోని సుగంధం నాడీ వ్యవస్థను ఉత్తేజ పరచడం ద్వారా ఒత్తిడి, ఆందోలనలను తగ్గిస్తుంది. 2005లో వెస్లియన్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం లావెండర్ సుగంధాన్ని పీల్చడం నిద్రవేళలో హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. డీపెస్ట్ అండ్ క్వాలిటీ స్లీప్‌ను ప్రోత్సహిస్తుంది. అయితే లావెండర్ మొక్కను బెడ్ రూములో ఉంచే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం అంటున్నారు నిపుణులు. బయటి వెలుతురు, ఎండ తగిలేలా కిటికీ దగ్గర పెట్టడం మంచిది.

Next Story