- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందరి హీరోయిన్లలా కాదు సంయుక్త వెరీ స్పెషల్.. 4000 ప్రాణులను రక్షించింది.!
4000 ప్రాణులను రక్షించి మానవత్వాన్ని చాటుతోంది

దిశ, ఫీచర్స్: కన్నడ చిత్ర పరిశ్రమలో తన నటనతో గుర్తింపు పొందిన సంయుక్తా హొరనాడ్.. సినిమాలతో పాటు ప్రాణుల సంక్షేమం కోసం అద్భుతమైన పనులు చేస్తోంది. ఆమె స్థాపించిన 'ప్రాణా యానిమల్ ఫౌండేషన్' ద్వారా 4000 కంటే ఎక్కువ ప్రాణులను రక్షించి మానవత్వాన్ని చాటుతోంది.
ప్రాణా యానిమల్ ఫౌండేషన్..
సంయుక్తా హొరనాడ్ 2007లో 'ఆ దినగలు' సినిమా నుంచి 2024లో వచ్చిన 'మాక్స్' వరకు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఐతే.. నటన తన జీవితంలో ఒక భాగం మాత్రమే. తన అసలైన అభిరుచి ప్రాణుల సంక్షేమం. ఈ దిశగా ఆమె చేస్తున్న పనులు సామాన్యులకు స్ఫూర్తిదాయకం. ఒకరోజు ఒక కాలవలో చిక్కుకున్న కుక్కపిల్లను చూసింది. ఆ పిల్లను రక్షించి 'గుండా' అని పేరు పెట్టి దత్తత తీసుకుంది. ఐతే.. కొంతకాలానికి అది చనిపోయింది. ఆ ఇన్సిడెంట్ తనలో ప్రాణుల పట్ల బాధ్యతను మరింత బలపరిచింది. 'ప్రాణా యానిమల్ ఫౌండేషన్' స్థాపించేలా ప్రేరేపించింది.
బెస్ట్ యానిమల్ రైట్స్ ఎన్జీఓ..
సంయుక్త ప్రాణా అనిమల్ ఫౌండేషన్‌ను 2022లో స్థాపించింది. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం వీధి ప్రాణులను రక్షించడం, పునరావాసం కల్పించడం, వాటికి ఇళ్లను సమకూర్చడం. బెంగళూరులోని కనకపుర రోడ్డు సమీపంలో ఈ సంస్థ ఒక పిల్లుల పునరావాస, దత్తత కేంద్రాన్ని నడుపుతోంది. వీధిలో తిరిగే, వదిలివేయబడిన పిల్లులకు చికిత్స, శస్త్రచికిత్స అనంతర సంరక్షణ, దత్తత సౌకర్యాలను అందిస్తుంది. ప్రాణా యానిమల్ ఫౌండేషన్ కేంద్రం 2025లో 7వ సీఎంఎస్బీ నేషనల్ అవార్డులలో 'బెస్ట్ యానిమల్ రైట్స్ ఎన్జీఓ'గా గుర్తింపు పొందింది.
ఉచిత యానిమల్ యాంబులెన్స్..
ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 4000 కంటే ఎక్కువ ప్రాణులను రక్షించింది సంయుక్త. ఇందులో కుక్కలు, పిల్లులు మాత్రమే కాకుండా చిరుతలు, ఎలుగుబంట్లు, ఏనుగులు, కోతులు, పాములు, గుడ్లగూబలు, ఉడుములు, టైగర్లు, సింహాలు, ఏనుగులు, పెంగ్విన్‌ల కూడా ఉన్నాయి. తాను సినిమాల్లో నటిస్తే వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని ఈ ప్రాణుల రక్షణ, పునరావాసం కోసం ఉపయోగిస్తుంది. సంయుక్తా ఫౌండేషన్ ఒక వినూత్న చర్యగా 2023లో బెంగళూరులో 24/7 ఉచిత యానిమల్ యాంబులెన్స్ సేవను కూడా ప్రారంభించింది.
వైల్డ్‌లైఫ్ అంబాసిడర్..
సామాజిక మాధ్యమాలను ప్రాణుల హక్కుల కోసం ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగిస్తుంది సంయుక్త. తన సోషల్ మీడియాలో మిగతా సినీ నటుల మాదిరిగా స్కిన్‌కేర్ లేదా యాడ్స్ గురించి కాకుండా.. ఎప్పుడూ ప్రాణుల సంక్షేమం గురించే పోస్ట్ చేస్తుంది. నటిగా తనకున్న గుర్తింపు స్వచ్ఛంద సేవకులను ఆకర్షించడానికి, నిధులు సేకరించడానికి సహాయపడేలా చూస్తుంది. పీపుల్ ఫర్ యానిమల్స్, వైల్డ్‌లైఫ్ వంటి సంస్థలకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ దక్షిణ భారత దేవాలయాల్లో ఏనుగులకు బదులు యాంత్రిక ఏనుగులను ఉపయోగించాలని పెటా ఇండియాకు మద్దతు ఇచ్చింది.






