- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండేళ్లపాటు చెట్టుపైనే నివసించిన మహిళ.. దానిని నరికి వేస్తుండగా చూసి..!
జూలియా బటర్‌ఫ్లై హిల్ వెయ్యి సంవత్సరాల పురాతనమైన ఒక చెట్టుపై ఎక్కి, రెండేళ్లపాటు అక్కడే నివసించింది.

దిశ, ఫీచర్స్ : కొన్ని విషయాలు హృదయాలను కదిలిస్తాయి. కొందరి జీవితాలు ఎందరికో స్ఫూర్తినిస్తాయి. కొన్ని సంఘటనలు మానవాళిని మేల్కొల్పుతాయి. కొన్ని కార్యక్రమాలు సమాజంపట్ల బాధ్యతను గుర్తు చేస్తాయి. ప్రముఖ ప్రపంచ పర్యావరణ వేత్త, అమెరికన్ ఎన్విరాన్‌మెంటల్ యాక్టివిస్ట్ & మోటివేషనల్ స్పీకర్ జీవితం కూడా అచ్చం అలాంటిదే. పర్యావరణ పరిక్షణ కోసం, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఒకప్పుడు ఆమె చేపట్టిన ఉద్యమం, నెలలతరబడి చెట్టుపైనే నివసించడం వంటి యాక్టివిటీస్ ఎంతోమందిని కదిలించాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతుండగా ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది.
పేరు జూలియా బటర్‌ఫ్లై హిల్. వయసు 52 ఏండ్లు. ఇక ఆమె పేరు చివర బటర్‌ఫ్లై అనేది ఎందుకు వచ్చిందంటే.. ఏడు సంవత్సరాల వయసులో ఒక బటర్‌ఫ్లై వచ్చి ఆమె వేలుపై కూర్చుందట.. అప్పటి నుంచి ఆమెను అందరూ బటర్‌ఫ్లై అనే నిక్‌నేమ్‌తో పిలవడం మొదలు పెట్టారు. క్రమంగా పేరు చివరన కూడా దానిని చేర్చారు. అయితే 1974 ఫిబ్రవరి 18న మిస్సౌరీలో జన్మించిన ఈమె ఎన్విరాన్‌మెంటల్ యాక్టివిస్ట్‌గా, మోటివేషనల్ స్పీకర్‌గా గుర్తింపు పొందారు. ఇప్పుడు ఇదంతాఎందుకు చెప్పుకుంటున్నామంటే.. ఆమె చేసిన పర్యావరణ పరిరక్షణ పోరాటం ప్రపంచాన్ని ఆలోచింపజేసింది.
చెట్ల సంరక్షణకోసం పోరాటం..
ప్రస్తుతం జూలియా బటర్‌ఫ్లై హిల్ ఒకప్పుడు చెట్ల నరికి వేతకు వ్యతిరేక ఉద్యమంలో భాగంగా చెట్టుపై నివసించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆసక్తిగా చర్చించకుంటున్నారు. ఇంతకీ ఆమె ఏం చేశారంటే.. 1997లో కాలిఫోర్నియాలోని హంబోల్ట్ ( Humboldt) కౌంటీలో పసిఫిక్ లంబర్ కంపెనీ తన అవసరాలకోసం ఎర్రచెట్ల అడవుల(Redwood forests)ను నరకడం మొదలు పెట్టింది. తన తండ్రి ప్రేరణతో ప్రకృతి, పర్యావరణంపట్ల చిన్నప్పటినుంచే ప్రేమను పెంచుకున్న జూలియా బటర్‌ఫ్లై ఇది చూసి చలించిపోయింది. చెట్ల నరికవేతకు నిరసనగా కొంతమంది సహచరులతో కలిసి ఉద్యమం మొదలు పెట్టింది.
చెట్టుపైనే నివాసం..
చెట్ల నరికివేత ఆగపోవడంతో తన ఉద్యమంలో భాగంగా జూలియా బటర్‌ఫ్లై హిల్ 1997 డిసెంబర్ 10న హంబోల్ట్ కౌంటీలోని స్టాఫోర్డ్ (Stafford) ప్రాంతంలో గల వెయ్యి సంవత్సరాల పురాతనమైన ఒక ఎర్ర చెట్టు(Redwood Tree)పై ఎక్కి అక్కడే నివసించడం మొదలు పెట్టింది. ఎంతకీ కిందకు దిగి రాలేదు. ఆ చెట్టుతోపాటు ఇతర అనేక చెట్ల నరికివేత ఆపేవరకు తాను అక్కడే ఉంటానని మొండికేసింది. అలా ఆమె ఎక్కిన ఆ చెట్టుకు ‘లూనా’ అని పేరు కూడా పెట్టారు. మొదట ఒకవారం మాత్రమే చెట్టుపై నివసించి నిరసన తెలపాలని అనుకుంది. కానీ ఆమె డిమాండ్‌ను అక్కడి కంపెనీ పట్టించుకోకపోవడంతో 738 రోజులు, అంటే సుమారు రెండు సంవత్సరాలు చెట్టుపైనే నివసిస్తూ నిరసన కొనసాగించింది.
చలిలో.. ఎండలో కూడా..
180-200 అడుగుల ఎత్తులో రెడ్ వుడ్ చెట్టుపై రెండు చిన్న ప్లాట్‌ఫారమ్‌లపై (6x4 అడుగులు) టెంట్‌లో జూలియా నివసించింది. ఆ సమయంలో ఆమెకు అవసరమైన ఆహారాన్ని సహచరులు రోప్‌లతో పైకి పంపేవారు. ఇక మీడియాతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు జూలియా.. సోలార్ పవర్ సెల్‌ఫోన్‌తో మాట్లాడేది. ఎల్ నినో తుఫాన్ వల్ల 40 మైళ్ల వేగంతో గాలులు వీచినా, చలి, వాన, ఎండ వంటి పరిస్థితుల్లో కూడా ఆమె చెట్టుపైనే నివసించింది. చివరకు 1999 డిసెంబర్ 18న సమస్య పరిష్కారం కావడంతో చెట్టు దిగివచ్చి ఎప్పటిలాగే సాధారణ జీవితం గడుపుతూ పర్యావరణ వేత్తగా తన జీవితాన్ని కొనసాగిస్తోంది.






