Viral Video: ఇండియాకు తెలుగింటి అల్లుడి...భారతీయ సంప్రదాయ దుస్తుల్లో జేడీ వాన్స్ పిల్లలు

by Vennela |

Viral Video: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 4 రోజులు పర్యటన నిమిత్తం సోమవారం భారత్ కు చేరుకున్నారు.

Viral Video: ఇండియాకు తెలుగింటి అల్లుడి...భారతీయ సంప్రదాయ దుస్తుల్లో జేడీ వాన్స్ పిల్లలు
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 4 రోజులు పర్యటన నిమిత్తం సోమవారం భారత్ కు చేరుకున్నారు. ఢిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియలో ఆయనకు, ఆయన కుటుంబానికి ఘన స్వాగతం పలికారు. వాన్స్ తోపాటు ఆయన సతీమణి ఉషావాన్స్, ముగ్గురు పిల్లలు, ఉన్నతస్థాయి అమెరికా ప్రతినిధుల బ్రుందం కూడా భారత్ పర్యటనకు వచ్చారు.

ఈ సందర్భంగా పాలెం ఎయిర్ పోర్టులో వాన్స్ కుటుంబం వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వాన్స్ ఇద్దరు కుమారులు భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా కుర్తా, పైజామా ధరించారు. వారి కుమార్తె లాంగ్ ఫ్రాక్ లో మెరిసిపోయారు. భారతీయ దుస్తుల్లో వాన్స్ పిల్లలు అందర్నీ ఆకట్టుకున్నారు. ఎయిర్ పోర్టులో వాన్స్ కు భారత సైనిక దళాల గౌరవ వందనం లభించింది.

కాగా అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జేడీ వాన్స్ భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఈ రోజు సాయంత్రం 6.30గంటలకు లోక్ కల్యాణ్ మార్క్ లోని ప్రధాని నరేంద్రమోదీ నివాసంలో వాన్స్ దంపతులు , అమెరికా ప్రతినిధులకు ఆతిథ్యం ఇస్తారు. తర్వాత ప్రధాని మోదీ, ఉపాధ్యక్షుడు వాన్స్ మధ్య అధికారిక చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రత, ద్వైపాక్షిక సంబంధాల గురించి ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఏప్రిల్ 23న వాన్స్ ఫ్యామిలీ ఆగ్రాకు ప్రయాణమై తాజ్ మహల్ ను , భారతీయ కళలను ప్రదర్శించే శిల్పాగ్రామ్ ను సందర్శిస్తారు. అదేరోజు మధ్యాహ్నం తిరిగి జయపురకు చేరుకుని..ఏప్రిల్ 24న జయపుర నుంచి అమెరికాకు తిరిగి ప్రయాణం అవుతారు.



Next Story