- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూన్ లైట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి.. ఇకపై బ్యాటరీలతో పనిలేదు!
మూన్ లైట్ నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు జపాన్ సైంటిస్టులు ప్రయోగం చేపట్టారు. పవర్ ప్లాంట్ సిద్ధం చేస్తున్నారు.

దిశ, ఫీచర్స్: భూమిపై కరెంట్ కష్టాలకు చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే పగలంతా సూర్యరశ్మినుంచి విద్యుత్తును ఉత్పత్తిచేసేలా సోలార్ ప్యానెల్‌ను డెవలప్ చేయగా.. ఇప్పుడు చంద్రుడి నుంచి 24 గంటలు కరెంట్‌ను ప్రొడక్ట్ చేసే భారీ పవర్ ప్లాంట్‌ను సిద్ధం చేస్తున్నారు. జపాన్‌కు చెందిన షిమిజు కార్పొరేషన్ (Shimizu Corporation) చేపట్టనున్న Luna Ring ప్రాజెక్ట్ ద్వారా పెరుగుతున్న ఇంధన అవసరాలు తీరడంతోపాటు బ్యాటరీల వినియోగం కూడా తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పగలు, రాత్రి మార్పుల వల్ల సౌరశక్తి ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది కానీ చంద్రుడు ఎల్లప్పుడూ ఒకే వాతావరణాన్ని కలిగివుండటంతో నిరంతరం పవర్ జనరేట్ చేయవచ్చు అంటున్నారు.
ఎలా పనిచేస్తుంది:
చంద్రుని చుట్టూ సుమారు 11,000 మైళ్ల పొడవున, 25 మైళ్ల వెడల్పుతో సోలార్ ప్యానెల్ నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్యానెల్ నేరుగా చంద్రుని నుంచి పవర్‌ను ప్రొడక్ట్ చేయదు. రాత్రి వాతావరణంలో జరిగే ఉష్ణ మార్పిడితో పనిచేస్తుంది. ఇది భూమి నుంచి విడుదలయ్యే Infrared Radiationను ఉపయోగించుకుంటుంది. రెగ్యులర్ సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్‌లా కాకుండా థర్మోరేడియేటివ్ డయోడ్లను యూస్ చేస్తుంది. పగలు సూర్యుడి నుంచి వేడిని గ్రహించిన భూమి.. రాత్రిపూట ఆ వేడిని ఇన్ఫ్రారెడ్ కాంతి రూపంలో అంతరిక్షంలోకి వదులుతుంది. ఈ క్రమంలో భూమిపై ఉన్న ప్రత్యేక స్టేషన్లు ఈ కిరణాలను స్వీకరించి విద్యుత్తుగా మారుస్తాయి. అత్యంత సెన్సిటివ్ నానో-మెటీరియల్స్ చంద్రకాంతి నుంచి పవర్ సేకరించనుండగా ఈ ప్రాసెస్ మొత్తం రాత్రిపూట భూమి చల్లబడే సూత్రంపైనే డిపెండ్ అవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.
ఉపయోగాలు:
రాత్రి, పొద్దంతా సూర్యుడు లేకపోయినా దీనిద్వార కరెంటును వినియోగించొచ్చు. చంద్రునిపై లేదా ఇతర గ్రహాలపై రాత్రి రోవర్లు పనిచేయడానికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో చంద్రునిపై మనుషులు నివసించాల్సి వస్తే ఈ టెక్నాలజీ కీలకం కానుంది. బ్యాటరీ ఖర్చు, బరువు తగ్గుతుంది. స్మార్ట్‌వాచ్‌లు లేదా చిన్నపాటి ఎలక్ట్రానిక్ పరికరాలు రాత్రిపూట కూడా వాటంతట అవే ఛార్జ్ అవుతాయి. ఈ ప్రాజెక్టుతో 2035 నాటికి చంద్రునిపై మట్టి తవ్వి, అక్కడ సౌకర్యాలను నిర్మించడానికి రోబోలను ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా సుమారు 13,000 టెరావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని,. ఇది ప్రస్తుతం మానవాళికి అవసరమైన దానికంటే చాలా ఎక్కువేనని తెలిపారు.






