- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెల్‌నెస్ టెక్నాలజీ.. స్ర్కోలింగ్‌ను అరికట్టే చుబ్బీ క్యాట్!
అతి స్క్రోలింగ్‌ను అరికట్టేందుకు జపనీస్ సాంకేతిక నిపుణులు ‘క్యాట్ గేట్‌కీపర్’ అనే కొత్త క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌ను అభివృద్ధి చేశారు.

దిశ, ఫీచర్స్ : ఎక్కువ సమయం కంప్యూటర్లపై పనిచేసేవారు. ఎండ్‌లెస్ స్క్రోలింగ్ అలవాటు ఉన్నవారు చాలా సందర్భాల్లో బ్రేక్ తీసుకోవడం కూడా మర్చిపోతుంటారు. మరికొందరు ఏం అవుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలాంటి వారికోసం జపనీస్ సాంకేతిక నిపుణులు ఒక చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నారు. స్క్రోలింగ్‌ను అరికట్టేందుకు క్యాట్ గేట్‌కీపర్ ( Cat Gatekeeper) అనే కొత్త క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌ను అభివృద్ధి చేశారు. ఈ టూల్ సోషల్ మీడియా & వీడియో ప్లాట్ ఫామ్‌లలో ఎక్కువ సమయం గడపకుండా నియంత్రిస్తుంది.
క్యాట్ గేట్‌కీపర్ (Chubby Cat) X, Instagram, YouTube వంటి పాపులర్ సైట్లపై పనిచేస్తుంది. దాని యూజర్లు డెస్క్‌టాప్‌పై వర్క్ చేస్తున్నప్పుడు లేదా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక్కో సెషన్‌కు 60 నిమిషాలు మాత్రమే వాడే అవకాశం ఇచ్చి, తర్వాత 5 నిమిషాలు సైట్‌ను బ్లాక్ చేస్తుంది. సాధారణ రిమైండ్‌లు సులభంగా ఇగ్నోర్ చేసేవారికి ఇది ఆకర్షణీయమైన చుబ్బీ క్యాట్‌ను స్క్రీన్‌పై చూపిస్తుంది. ఈ క్యాట్ పేజీని పూర్తిగా ఆక్రమించి, బ్రేక్ తీసుకోవాల్సిందిగా సూచిస్తుంది. స్క్రీన్ టైమ్‌ను నియంత్రించడాన్ని బోరింగ్ రిమైండ్‌లకంటే జాయ్‌ఫుల్‌గా, ఆకర్షణీయంగా చేయడమే ఈ ఎక్స్‌టెన్షన్ లక్ష్యమని నిపుణులు చెబుతున్నారు. అతిగా స్క్రోల్ చేసేవారి కంట్రోల్ చేయడమే కాకుండా, బ్రేక్ తీసుకునేలా చేసి, డిజిటల్ వెల్‌నెస్‌ను ప్రోత్సహిస్తుంది. డెస్క్‌టాప్‌లో/ల్యాప్‌టాప్‌లో క్రోమ్ బ్రౌజర్లో దీనిని సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.






