Technology : ఇంట్లో ఎగురుతూ హెల్ప్ చేసే ‘రోబోటిక్ ఫ్రెండ్’!

by Javid Pasha |

ఫ్లోటింగ్ కంపానియన్ రోబోలు వ్యక్తులను అనుసరించి తిరుగుతాయి. చదువులో, పనుల్లో హెల్ప్ చేస్తాయి.

Technology : ఇంట్లో ఎగురుతూ హెల్ప్ చేసే ‘రోబోటిక్ ఫ్రెండ్’!
X

దిశ, ఫీచర్స్ : ఇప్పటి వరకు సాధారణ రోబోలు, యంత్రాల మాదిరి ఫ్లయింగ్ రోబోలు, డ్రోన్ల గురించే మనకు తెలుసు. కానీ భవిష్యత్తులో ఇంటిలో, ఇంటి పరిసరాల్లో ఎగురుతూ వ్యక్తిగత అవసరాలకు సహాయం అందించే ఫ్లోటింగ్ కంపానియన్ రోబోలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు సాంకేతిక నిపుణులు. ఇప్పటికే దీనిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. కాగా ఇటీవల జపాన్‌‌కు చెందిన పరిశోధకులు మింగ్యాంగ్ జు (Mingyang Xu), యాన్హెంగ్ లి (Yanheng Li) అనే ఇద్దరు పరిశోధకులు ఈ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఈ సాఫ్ట్ ఫ్లోటింగ్ రోబటిక్ టెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పరిశోధకులు ఇటీవల అభివృద్ధి చేసిన ఫ్లోటింగ్ కంపానియన్ అనే సాఫ్ట్ రోబోను పరిశోధకులు ఇండోర్ వాతావరణంలో, మనుషులతో సహజంగా పరస్పర చర్యలు చేసేందుకు రూపొందించారు. ముఖ్యంగా ఇది హీలియం నింపిన సాఫ్ట్ ఎన్వలప్‌తో ఉంటుంది. సాధారణ డ్రోన్లలో ఉండే శబ్దం చేసే ప్రొపెల్లర్లకు బదులుగా మెత్తని ఫ్లాపింగ్ ఫిన్స్ (రెక్కలు) ఉపయోగించి గాలిలో కదులుతుంది. దీని వల్ల ఇది తేలికగా, శబ్దం లేకుండా, సురక్షితంగా ఉంటుందని నిపుణుల చెబుతున్నారు. అయితే ఈ తరహా ఫ్లోటింగ్ రోబోను తయారు చేయడం ఇప్పుడే మొదటిసారి. ఇంకా పూర్తిగా ఇలాంటి సాంకేతికత అందుబాటులోకి రాలేదు. భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఎలా పనిచేస్తాయి?

ఫ్లోటింగ్ కంపానియన్ రోబోలు కార్బన్ ఫైబర్ రెక్కలు, లైట్‌వెయిట్ బ్యాటరీతో నడుస్తాయి. ఇవి వ్యక్తులను అనుసరించి తిరగలవు, రిమైండర్లు ఇవ్వగలవు. చదువులో సహాయకుడిగా (study buddy) పని చేయగలవు అంటున్నారు నిపుణులు. ఇంటిలో, పాఠశాల్లో, కార్యాలయాల్లో కదలాడుతూ సహాయం చేయడంలో ఉపయోగపడతాయని చెబుతున్నారు. పైగా వీటి సాఫ్ట్ డిజైన్, ప్రశాంతమైన కదలికలు (Calm movements) వాటిని ఒక యంత్రంలా కాకుండా వివిధ పనుల్లో హెల్ప్ చేస్తున్న స్నేహితుల్లా అనిపించేలా చేస్తాయి.

లక్ష్యం ఏమిటి?

జపాన్‌లో ఈ తరహా రోబోల తయారీ ఈ ఏడాది (2026)లో ప్రదర్శించారు. సాధారణ ఫ్లైయింగ్ రోబోల సమస్యలను అధిగమించి, మానవులు-రోబోల మధ్య ఇంటరాక్షన్‌ను మరింత సహజంగా మార్చడం ఈ సాంకేతికత లక్ష్యంగా నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఫ్లోటింగ్ కంపానియన్ రోబోలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో లేవు. ఇంకా అభివృద్ధి దశలో ఉన్నాయి. భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చి యూజర్లకు రోజువారీ సహచరులుగా మారవచ్చు అంటున్నారు నిపుణులు.

ఉపయోగాలు

*ఇంటి లోపల వ్యక్తులను అనుసరిస్తూ తిరుగుతాయి(follow people).

*మందులు వేసుకోవడం, సమయానికి పనులు చేసుకోవడం వంటి విషయాల్లో రిమైండర్లు ఇస్తాయి

*చదువులో, వివిధ పనుల్లో సహాయం చేస్తాయి.

*ఇలు, స్కూల్, ఆఫీస్ వంటి ప్రదేశాల్లో ప్రశాంతంగా, శబ్దం లేకుండా ఒక సహాయకుడిగా ఉంటాయి.

*భవిష్యత్తులో భావోద్వేగ సహచరులు(emotional companions)గా, అంబియంట్ అసిస్టెంట్స్‌గానూ కూడా ఉపయోగపడవచ్చు.

Next Story