ఏం ఐడియా గురూ.. ఏసీలేకుండానే ఇల్లంతా చల్లగా..!

by Javid Pasha |

పింక్ సిటీలోని చాలామంది రూఫ్‌టాప్ గార్డెనింగ్‌‌తో ఇంటి వాతావరణాన్నిచల్లగా మార్చుకోగలిగారు.

ఏం ఐడియా గురూ.. ఏసీలేకుండానే ఇల్లంతా చల్లగా..!
X

దిశ, ఫీచర్స్ : అసలే ఎండలు మండుతున్నాయి. భానుడి భగ భగలకు తట్టుకోలేక జనం రకరకాల ‘కూలింగ్ ఐడియా’లను అమలు చేస్తున్నారు. పలువురు కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలువాడుతుంటే.. అవి వాడే స్థోమత లేనివారు, ఆసక్తి లేనివారు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు చల్లగా ఉంచుకోవడానికి తమ ఇంటి పైప్పు భాగాన గోనె సంచులతో, వరిగడ్డితో, తాటి కమ్మలతో కప్పడం వంటివి చేస్తున్నారు. అయితే రాజస్థాన్‌లోని పిక్‌సిటీ(ఉదయ్‌పూర్)లో మాత్రం 4000 కుటుంబాలు ఇవేవీ చేయకుండానే తమ ఇండ్లను అత్యంత చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చేసుకున్నారు. ఇది చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా ప్రశంసలు కురిపిస్తు్న్నారు. ఇంతకీ వాళ్లేం చేశారంటే..

రూఫ్‌టాప్ గార్డెనింగ్‌తో..

ఏసీలు వాడితే చల్లగా ఉంటుందేమో కానీ నిర్వహణ ఖర్చు ఎక్కువే. కూలర్లు, ఫ్యాన్లు వాడినా కరెంటు అంతే కరెంటు బిల్లులు పెరిగి ఖర్చులు పెరుగుతాయి. అయితే ఇలాంటి ఇబ్బందులేవీ లేని అద్భుతమైన ఆలోచనకు తెరతీశారు జైపూర్ వాసులు. ఇంటి లోపలి వేడి తగ్గించడానికి ఒక సింపుల్ రూఫ్‌టాప్ మోడిఫికేషన్‌ను అవలంబించారు. ఏమిటంటే.. ఇంటి పైకప్పులన్నింటినీ రకరకాల కూరగాయల మొక్కలు, తీగలు, పచ్చని గడ్డిని పెంచడం ద్వారా గ్రీన్ స్పేస్‌గా, రూఫ్‌టాప్ గార్డెనింగ్‌గా మార్చేశారు. దీంతో ఇండోర్ టెంపరేచర్‌ను 50% వరకు తగ్గించగలిగారు. అంటే ఎటువంటి ఏసీ అవసరం లేకుండానే ఇండ్లల్లో చల్లని వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నారు.

ఆరోగ్యంగా.. ఆనందంగా..

జైపూర్ వాసుల ‘చల్లని ఐడియా’ వెనుక లివింగ్ గ్రీన్ ఆర్గానిక్ అనే ఒక స్థానిక స్టార్టప్ ప్రోత్సాహం కూడా ఉంది. ఇంటిపై గార్డెనింగ్‌ను పెంచడం ద్వారా ఇంటి అవసరాలు తీరడమే కాకుండా, చల్లని వాతావరణాన్ని ఆస్వాదించవచ్చుననే ఆ స్టార్టప్ ఆలోచనలను అమలు చేయడం ద్వారా ఇప్పుడు ఎన్నో కుటుంబాలు సంతోషంగా జీవిస్తున్నాయి. మండే ఎండల్లో కూడా ఏసీలు లేకుండా చల్లటి గాలిని, వాతావరణాన్ని ఆస్వాదిస్తుస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటున్నాయి. రూఫ్‌టాప్ గార్డెనింగ్ వల్ల కేవలం చల్లదనం మాత్రమే కాకుండా కూరగాయలు పండించడం, వర్షపు నీటిని నిల్వచేయడం వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు దీనిని అమలు చేస్తున్నవారు. పైగా ఇది తక్కువ ఖర్చుతో కూడిన పర్యావరణ అనుకూలమైన ఆలోచన కూడా కావడంతో అందరూ ప్రశంసిస్తున్నారు. వేడి ఎక్కువగా ఉండే నగరాలు, గ్రామాలు ఈ ఐడియాను అమలు చేస్తే పెద్దగా ఖర్చులేకుండానే చల్లదాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

Next Story