- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమించిన వ్యక్తి దూరమైతే ఎందుకంత బాధ? మెదడు చేసే మ్యాజిక్ అంటున్న నిపుణులు
ప్రేమించిన వ్యక్తి దూరమైనప్పుడు మెదడులోని అంటీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్(ACC) యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత జరిగేది ఏమిటంటే..

దిశ, ఫీచర్స్ : మీరు మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి సడెన్‌గా మాట్లాడటం ఆపేస్తే.. కనీసం మెసేజ్ కూడా చేయకపోతే.. మీరు మెసేజ్ చేసినా రిప్లయ్ ఇవ్వకపోతే.. ప్రతీ విషయంలో మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంటే.. ఎంత బాధగా ఉంటుందో అనుభవించేవారికే తెలుస్తుంది అంటుంటారు బాధితులైతే! సైన్స్ కూడా అదే చెబుతోంది. ప్రేమించిన వ్యక్తి నుంచి ఎదురయ్యే తిరస్కరణ వల్ల కలిగే బాధ వర్ణనాతీతమని పేర్కొంటున్నది. అయితే ఇది లోతైన బాధను కలిగించడంలో మెదడు కీ రోల్ పోషిస్తుందని కూడా వెల్లడిస్తోంది. గతంలో జరిగిన ‘సోషల్ న్యూరోసైన్స్ జర్నల్’ స్టడీ సహా పలు ఇతర అధ్యయనాలు సైతం ఇదే పేర్కొన్నాయి.
మెదడుపై ప్రభావం
ప్రేమించిన వ్యక్తి దూరమైనప్పుడు, కనిపించకుండా పోయినప్పుడు, మాట్లాడటం ఆపేసినప్పుడు, పదే పదే తిరస్కరిస్తున్నప్పుడు ఆ వ్యక్తి గురించి మరింత ఎక్కువగా ఆలోచిస్తారు. ఎందుకంటే మీ మెదడులోని అంటీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్(ACC) యాక్టివేట్ అవుతుంది. నిజానికి ఇది భావోద్వేగ బాధ, శారీరక నొప్పి (Emotional distress and physical pain) రెండింటినీ ఒకే విధంగా ప్రాసెస్ చేస్తుంది. కాబట్టి హార్ట్‌బ్రేక్, శారీరక గాయం మధ్య తేడా గుర్తించదు. కాబట్టి సామాజిక తిరస్కరణ లేదా ఇగ్నోర్ చేయబడినప్పుడు ఒకే న్యూరల్ సర్క్యూట్లు ఫైర్ అవుతాయి. ఇవి శరీరంలో స్ట్రెస్ సిగ్నల్స్ పంపుతాయి.
ఆలోచనలు, జ్ఞాపకాలు, ఆరోగ్యం
మెదడులో అంటీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్(ACC)యాక్టివేట్ కారణంగా ప్రేమించిన వ్యక్తి తాలూకు ఊహలు, ఆలోచనలు, జ్ఞాపకాలు మరింత బాధకు గురిచేస్తాయి. ఈ పరిస్థితి వల్ల ఛాతీ బిగుసుకుపోవడం, కడుపు ఒక్కసారిగా డ్రాప్ అవుతున్నట్లు అనిపించడం, గత అనుభవాలు, సంఘటనలు నిరంతరం మెదడులో రీప్లే చేయడం వంటి లక్షణాలకు దారితీస్తుంది. పైగా ఇలాంటప్పుడు మెదడు భావోద్వేగ నిశ్శబ్దాన్ని (Emotional silence) నిజమైన ప్రమాదంగా భావిస్తుంది. కాబట్టి బాధ పూర్తిగా వాస్తవ రూపం దాల్చి మనసును కలచి వేస్తుంది. పరోక్షంగా నిద్రలేమి, ఆకలి వేయకపోవడం, ఏకాగ్రత కుదరకపోవడం వంటి మానసిక, శారీరక ఆరోగ్యాలకు సైతం దారితీయవచ్చు.
డిప్రెషన్‌కు దారితీసే చాన్స్!
అందుకే ప్రేమలో మోసపోయినవారు లేదా విఫలమైన వారు ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం కష్టంగా మారుతుంది. ఎందుకంటే మెదడులోని అంటీరియర్ సింగ్యేలేట్ కార్టెక్స్(Anterior cingulate cortex) ఇందులో కీ రోల్ పోషిస్తుంది. దీంతో ఇగ్నో్ర్ చేసిన వ్యక్తి తాలూకు బాధ నుంచి వెంటనే కోలుకోలేరు. ఇక సెల్ఫ్‌ఎస్టీమ్ తక్కువ ఉన్నవారిలో ఈ ప్రేమ బాధ మరింత తీవ్రంగా ఉంటుందని, ప్రేమించిన వ్యక్తి ద్వారా ఇగ్నోర్ చేయబడినప్పుడు శరీరం స్ట్రెస్ హార్మోన్లను విడుదల చేసి, ఆందోళన, అలాగే డిప్రెషన్‌కు దారితీస్తుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మెదడు ఈ భావోద్వేగ నిశ్శబ్దాన్ని ప్రమాదంగా భావించి ఫైట్-ఆర్-ఫ్లైట్ రెస్పాన్స్‌ను ట్రిగ్గర్ చేయడంవల్ల ఇలా జరుగుతుంది. అంటే ఇదంతా ఒక విధంగా మెదడు చేసే మ్యాజిక్ అన్నమాట!






