- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ గుండె పదిలమేనా..? గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి
మీ గుండె పదిలమేనా.. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఎందుకంటే ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుండె పోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధుల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: మీ గుండె పదిలమేనా.. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఎందుకంటే ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుండె పోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధుల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. మన శరీరంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మనం తీసుకునే ఆహారంలో నాణ్యత లేకపోవడం, డయాబెటిస్, అధిక రక్తపోటు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి, మద్యపానం, ధూమపానం, ఊబకాయం మొదలైనవి గుండె పనితీరుపై ప్రభావం చూపుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు వంటి తృణధాన్యాలను ఎక్కువగా తింటే మంచిది. ఫైబర్ తో పాటుగా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు తినే ఆహారంలో ఉప్పు తక్కువ వేసుకోవాలి.






