Viral Video: పాక్ ప్రధాని ఎదురుపడితే నిజంగా మోడీ రియాక్షన్ ఇలాగే ఉంటుందేమో.. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్

by Vennela |

Viral Video: సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన అనంతరం క్రియేటివిటీకి అడ్డు అదుపు లేకుండా పోయాయి.

Viral Video: పాక్ ప్రధాని ఎదురుపడితే నిజంగా మోడీ రియాక్షన్ ఇలాగే ఉంటుందేమో.. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : Viral Video: సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన అనంతరం క్రియేటివిటీకి అడ్డు అదుపు లేకుండా పోయాయి. తమకు నచ్చిన క్యారెక్టర్ లను రకరకాలుగా మార్చేసి వాటి ద్వారా తమ ఫీలింగ్స్ ను ఎక్స్ప్రెస్ చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలను అయితే ఎడాపెడా వాడేస్తున్నారు.

కొంతమంది సినిమా హీరోల ఫ్యాన్స్ అయితే ఏకంగా తమ సినిమా హీరోలు త్వరలో విడుదలయ్యే సినిమాలను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి కథను ఊహించుకొని స్టోరీ బోర్డు తయారు చేసుకొని మరి సీన్లను క్రియేట్ చేసి ఫ్యాన్ మేడ్ టీజర్లు ట్రైలర్ రిలీజ్ చేసేస్తున్నారు. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి ఏమాత్రం కల్లాలు లేని గుర్రంలా తయారైందని చెప్పవచ్చు.

అయితే తాజాగా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో మీమర్లు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఇద్దరి మధ్యలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇలాంటి క్యారెక్టర్ లను సృష్టించి, భారత ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ ప్రధానమంత్రి చొక్కాను పట్టుకుంటున్నట్లు, అయితే వీరిద్దరిని వారించి డోనాల్డ్ ట్రంప్ కంట్రోల్ చేస్తున్నట్లు ఈ వీడియోలో చూడవచ్చు.

ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. దీన్నిబట్టి మీమర్స్ భారత్ పాకిస్తాన్ పట్ల ఎంత కోపంతో ఉందో ప్రపంచానికి తెలియజేస్తున్నారు. . జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయక ప్రజలపై కావలపులు చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటన అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

మరోవైపు ఇప్పటికే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులకు ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు అయినా స్వేచ్ఛనిస్తూ ప్రకటన చేశారు. దీంతో అతి త్వరలోనే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగడం తధ్యమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతకన్నా ముందే డిజిటల్ వేదికగా ఈ యుద్ధం జరగడం విశేషం.



Next Story