- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పక్షుల్లో లవ్ ఎట్ సైట్.. ఇంత రొమాంటిక్‌గా ఉంటుందా?
మనుషుల మాదిరిగానే పక్షుల్లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉంటుందా? అనే ప్రశ్న ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

దిశ, ఫీచర్స్ : మనుషుల మాదిరిగానే పక్షుల్లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉంటుందా? అనే ప్రశ్న ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కానీ ఈ విషయాన్ని ఈజీగా కనిపెట్టవచ్చని చెప్తోంది తాజా అధ్యయనం. ఉష్ణమండల పక్షులు ప్రత్యేకంగా జావా పిచ్చుకలు ప్రేమలో ఉన్నప్పుడు వాటి కంటి వలయాలు పెద్దగా అవుతాయని పరిశోధకులు కనుగొన్నారు.
జపాన్ శాస్త్రవేత్తల ప్రకారం ఈ లక్షణాలు మగ, ఆడ జావా పిచ్చుకల్లో కనిపిస్తాయి. డ్యూయెట్ డ్యాన్స్, వోకల్ అండ్ నాన్-వోకల్ సౌండ్‌లతో పాటుగా జంటల మధ్య సంభాషణలో ఐ రింగ్ చేంజెస్ ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి.
రొమాంటిక్ టైంలో పక్షులు పాడటం, డ్యాన్స్ చేయడం, ఈకలను ప్రదర్శించడం ఇంతకు ముందే తెలిసినప్పటికీ.. ఐ పుపిల్స్ లో ఉబ్బిన ఎర్రటి రంగు వలయాలు ఏర్పడటం రొమాంటిక్ కెమిస్ట్రీకి సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పడమేనని అంటున్నారు శాస్త్రవేత్తలు. సంతానోత్పత్తి సమయంలో కంటి చుట్టూ గులాబీ రంగు ఏర్పడటంతోపాటు కంటి వలయాలు ఎర్రగా మారిపోవడం గమనించినట్లు తెలిపారు.






