మళ్లీ పెళ్లి.. కరెక్టేనా? వాటి నుంచి రిఫ్రెష్ కాకపోతే పాత గాయాలే..!

by Bhoopathi Nagaiah |

పెళ్లి అనేది లైఫ్ లో ఇంపార్టెంట్ మైల్ స్టోన్. కానీ కొన్నిసార్లు అది వర్క్ అవుట్ కాదు.

మళ్లీ పెళ్లి.. కరెక్టేనా? వాటి నుంచి రిఫ్రెష్ కాకపోతే పాత గాయాలే..!
X

దిశ, ఫీచర్స్ : పెళ్లి అనేది లైఫ్ లో ఇంపార్టెంట్ మైల్ స్టోన్. కానీ కొన్నిసార్లు అది వర్క్ అవుట్ కాదు. భాగస్వామితో సంతోషంగా జీవించలేక విడాకులు తీసుకుంటారు. అయితే ఇది హ్యాపీ మ్యారేజ్ డ్రీమ్ కు ముగింపు అని అర్థం కాదు. రెండో వివాహంతో ఆనందంగా జీవించాలని ఆశపడతారు. అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు గత గాయాల నుంచి బయటపడాలని, ఇందుకోసం మిమ్మల్ని మీరు ఆర్గనైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎమోషనల్ గా, ఫిజికల్ గా, ఫైనాన్షియల్ గా కరెక్ట్ ప్లేస్ లో ఉన్నారో లేదో నిర్ధారించుకోవాలని అంటున్నారు.

కొంతమంది విడాకుల తర్వాత ఒంటరిగా ఎలా ఉండాలో తెలియక భయంతో రీమ్యారేజ్ డెసిషన్ తీసుకుంటారు. ప్రజెంట్, ఫ్యూచర్ లో లోన్లీగా ఉండటాన్ని తలుచుకుని మరొకరితో వివాహ బంధానికి ఓకే అంటారు. ఇంకొందరు డబ్బు కోసమో, ఎక్స్ ను జలస్ ఫీల్ అయ్యేలా చేసేందుకో గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కానీ దీనికి ముందు మీరు చేసుకోబోయే పార్టనర్ గురించి పూర్తిగా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంటున్నారు నిపుణులు. అప్పుడే తప్పు రిపీట్ కాకుండా ఉంటుందని సూచిస్తున్నారు.

విడాకుల తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉండటం ముఖ్యం. మరో మ్యారేజ్ చేసుకునే ముందు.. సొంతంగా కొంత సమయం మీరు మీతో గడిపారా? ఇతర వ్యక్తులతో డేటింగ్ చేసారా? సింగిల్ గా ఉండటం బాగానే ఉందా? అని ప్రశ్నించుకోండి. రెండోసారి పెళ్లి చేసుకోవడం అంటే మ్యారేజ్ అనే కాన్సెప్ట్‌కి మరో అవకాశం ఇస్తున్నట్లే. దీని అర్థం మీరు ఆ పద్ధతిని నమ్ముతున్నారు. గౌరవిస్తున్నారు. కానీ రాబోయే భాగస్వామి కూడా అలాగే భావిస్తున్నారా? ఆలోచించండి. అంతేకాదు గత వివాహబంధంలో ఉన్నంత కనెక్టివిటీ, శారీరక స్పర్శ ఉండకపోవచ్చు. కానీ ఇద్దరు భాగస్వాములను పోలుస్తూ తప్పులు సరిదిద్దుకోవటం మంచి పద్ధతి.

ఖచ్చితంగా రెండవ వివాహం విజయవంతం కావాలని మీరు ఆశించడంలో తప్పులేదు. కానీ ఎక్కువ అంచనాలు పెంచుకుంటే నిరాశకు గురవుతారు. ఇక మీరు, మీ కొత్త జీవిత భాగస్వామి గత వివాహ బంధాల నుంచి విముక్తి పొందినా.. మాజీతో ఎంతో కొంత కనెక్షన్ ఉండి ఉంటుంది. ఇప్పటికే కిడ్స్ కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు బ్లెండెడ్ ఫ్యామిలీ కాంప్లెక్సిటీస్ పరిగణించాలి. వేర్వేరు వ్యక్తులు, విభిన్న వ్యక్తిత్వాలు, వారి సొంత ఎంపికతో కలిసి ఉండబోతున్నారని అర్థం చేసుకోవాలి. ఎమోషనల్, లాజిస్టికల్, ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవాలి. ముందే మీ బాధ్యతలు గురించి చర్చించుకోవడం మంచిది. ఫైనల్ గా రీమ్యారేజ్ చట్టానికి అనుగుణంగా ఉందో లేదో చెక్ చేసుకోండి.

Next Story